వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో రెండు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ.. పురపాలక చట్టంపై చర్చ...

|
Google Oneindia TeluguNews

ప్రక్షాళన చేసిన పురపాలక చట్టానికి ఆమోదం తెలిపేందుకు ప్రత్యేకంగా రెండు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లి సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఈనెల 18, 19 తేదిల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. రెండు రోజుల సమావేశంలో భాగంగా కొత్త మున్సిపల్ చట్టానికి ఆమోద ముద్ర వేయనున్నారు.

పురపాలక చట్టం కోసం ప్రత్యేక అసెంబ్లీ


రాష్ట్రంలో కొత్త పురపాలక చట్టంపై చర్చించేందుకు గాను ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే రూపోందించిన ముసాయిదా బిల్లును న్యాయశాఖకు పంపించిన ప్రభుత్వం చర్చ అనంతరం నూతన చట్టాన్ని తీసుకురానుంది. కాగా 18న బిల్లును ప్రవేశ పెట్టి చర్చించనున్నారు. ఒక రోజు చర్చ తర్వాత 19వ తేదిన ఆమోదం తెలపనున్నారు. అదేరోజు శాసన మండలిలో కూడ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకోనున్నారు.కాగ ఇప్పటికే పురపాలక ఎన్నికలు జరగాల్సి ఉండగా కొత్త చట్టం కోసం అనంతరమే వీటిని నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది

ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేందుకు...

ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేందుకు...


దీంతో కొద్ది రోజుల్లో జరగనున్న మున్సిపాలిటి ఎన్నికలు కొత్త చట్టం ప్రకారం కొనసాగనున్నాయి. కొత్త చట్టంలో పలు కఠిన నిబంధలు తెచ్చారు. ఇందుకోసం అవినీతికి ఆస్కారం లేకుండా నూతన అర్బన్ పాలసీ రూపొందించాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా రూపకల్పన చేయాలని సూచించారు. ప్రణాళికబద్దంగా అభివృద్ధి జరిగేలా కొత్త పాలసీని తీర్చిదిద్దాలని కోరారు. ఆ మేరకు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో దిశానిర్దేశం చేశారు. అర్బన్, రూరల్, రెవెన్యూ పాలసీలతో పాటు కార్పొరేషన్‌ల కోసం నూతన చట్టాల రూపకల్పనపై కీలక సూచనలు చేశారు.

 అవినీతి అక్రమాలకు దూరంగా.. కొత్త చట్టాల రూపకల్పన..

అవినీతి అక్రమాలకు దూరంగా.. కొత్త చట్టాల రూపకల్పన..

అక్రమ కట్టడాలకు ఏ మాత్రం వీలులేని విధంగా కొత్త చట్టాలు రూపొందించాలని ఆదేశించారు కేసీఆర్. అవినీతి జరగడానికి ఆస్కారం లేకుండా రూపొందించాలని సూచించారు. పచ్చదనం పరిశుభ్రత వెల్లివిరిసేలా నగరాలు, పట్టణాలను తీర్చిదిద్దడానికి ఉపయోగపడే విధంగా కొత్త చట్టంలో తేనున్నారు. కొత్త చట్టాల ప్రకారమే నగర పాలన జరిగే విధంగా నిర్ణయం తీసుకోనున్నారు.. ఆ క్రమంలో అధికారులకు, నేతలకు బాధ్యతలు అప్పగించబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

English summary
Telangana government has planned to hold assembly meetings on the 18th and 19th of this month.Separate assembly meetings new municipal law will be introduced,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X