వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

28 వరకు అసెంబ్లీ: 17 వర్కింగ్ డేస్ - బీఏసీలో ఖరారు - ప్రణబ్, సోలిపేటకు సంతాపం - సభ వాయిదా

|
Google Oneindia TeluguNews

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈనెల 28 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 17 పనిదినాలపాటు సభ నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. వర్షాకల భేటీ తొలిరోజైన సోమవారం... దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలకు అసెంబ్లీ నివాళులు అర్పించింది. వారి మరణాలపై సంతాప తీర్మానాల తర్వాత సభ మంగళవారానికి వాయిదా పడింది. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఛాంబర్ లో బీఏసీ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కేసీఆర్ సర్కార్ మరో సంచలనం - రిజిస్ట్రేషన్లు బంద్, ఆ శాఖకు సెలవులు - పున:ప్రారంభంపై నో క్లారిటీకేసీఆర్ సర్కార్ మరో సంచలనం - రిజిస్ట్రేషన్లు బంద్, ఆ శాఖకు సెలవులు - పున:ప్రారంభంపై నో క్లారిటీ

స్పీకర్ ఆధ్వర్యంలో జరిగిన బీఏసీ మీటింగ్ లో ముఖ్యమంత్ర కేసీఆర్, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. అసెంబ్లీ నిర్వహణపై చర్చించిన నేతలు.. ఈనెల 28 వరకు సమావేశాలు జరపాలనే నిర్ణయానికి ఒకే చెప్పారు. ఈనెల 12 రెండో శనివారం, 13 ఆదివారం, 20 ఆదివారం, 27 ఆదివారం సెలవులుపోను, మొత్తం 17 పనిదినాలు సభ జరుగనుంది.

మంగళవరం నాటి సభలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల అంశంపై చర్చించాలని బీఏసీ నిర్ణయించింది. పీవీ శతజయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, అసెంబ్లీలో మీడియా పాయింట్ ఎత్తివేత కరెక్ట్ కాదని సీఎల్పీ నేత భట్టి బీఏసీలో తన నిరసన తెలిపారు. కొవిడ్ కారణంగానే ఆ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

telangana assemby session up to 28 sep, total 17 working days: BAC meet

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి పట్ల తెలంగాణ శాసనసభ ప్రగాఢ సంతాపం తెలిపింది. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటులో ఆ ఇద్దరి పాత్రను నేతలు గుర్తుచేసుకున్నారు. ప్రణబ్‌ మరణం పట్ల సంతాపం తీర్మానాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రవేశపెట్టారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ పేరు లేని పేజీ ఉండదన్నారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి సంతాపం తీర్మానం సందర్భంగా సీఎం, మంత్రులు మాట్లాడారు. = నిత్యం ప్రజల మధ్యే తిరుగుతూ నిరాడంబరంగా జీవించిన నాయకుడు రామలింగారెడ్డి అని సీఎం కేసీఆర్ కొనియాడారు.

English summary
busines advisory comitee(bac) on monday has decided to held telangana assemby session up to 28 september. after tributes to late president pranab mukherjee and late mla solipeta ramalinga reddy, session adjourned to tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X