హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా కంట్రోల్ లో తెలంగాణా భేష్ ... అందరూ ఫాలో అవ్వాలని కేంద్రమంత్రి కితాబు

|
Google Oneindia TeluguNews

తెలంగాణా ప్రభుత్వం కరోనా కంట్రోల్ లో చాలా బాగా పని చేస్తుందని కితాబిచ్చారు కేంద్రమంత్రి హర్షవర్ధన్ . నేడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా కంట్రోల్ కోసం రాష్ట్రాల్లో చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్న ఆయన తెలంగాణా ప్రభుత్వ చర్యలను భేష్ అన్నారు.

కరోనా పుకార్లపై కన్నెర్ర చేస్తున్న ఏపీ డీజీపీ ... కేసులు పెడతామని వార్నింగ్కరోనా పుకార్లపై కన్నెర్ర చేస్తున్న ఏపీ డీజీపీ ... కేసులు పెడతామని వార్నింగ్

 31కి చేరిన భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య

31కి చేరిన భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య

చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రస్తుతం 60కి పైగా దేశాలను వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కరోనా వైరస్ ప్రస్తుతం భారత దేశంలోనూ వ్యాపిస్తుంది. భారతదేశంలో వందల సంఖ్యలో కరోనా అనుమానితులు ఆస్పత్రుల్లో ఉన్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఇక తాజాగా భారత్‌లో మరో కరోనా కేసు నమోదయింది. ఈరోజు కరోనా వైరస్ పాజిటివ్ గా ఒక వ్యక్తి రిపోర్ట్స్ నిర్ధారించటం తో భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 31కి చేరింది. ప్రస్తుతం అతనికి ఢిల్లీలో చికిత్స అందిస్తున్నారు.

అన్ని రాష్ట్రాల మంత్రులు, అధికారులతో కేంద్రమంత్రి వీడియో కాన్ఫరెన్స్

అన్ని రాష్ట్రాల మంత్రులు, అధికారులతో కేంద్రమంత్రి వీడియో కాన్ఫరెన్స్

ఈ నేపధ్యంలో అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అన్ని రాష్ట్రాల మంత్రులతో సమావేశంలో చర్చించారు . ఇక ఈ వీడియో కాన్ఫరెన్స్ తెలంగాణా రాష్ట్రం కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలను కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ కొనియాడారు. అన్ని రాష్ట్రాలు తెలంగాణా తరహాలో చర్యలు చేపట్టాలని సూచించారు.

తెలంగాణా రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్న మంత్రి హర్షవర్ధన్

తెలంగాణా రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్న మంత్రి హర్షవర్ధన్

కరోనా వైరస్‌ను నియంత్రించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు కేంద్రం ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్. కరోనా వైరస్‌ ప్రస్తుత పరిస్థితిపై అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ యోగితా రాణాలతో తెలంగాణా రాష్ట్రంలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Recommended Video

Shop Keeper Selling Face Masks Higher Than MRP | వినియోగదారులు మేలుకోండి ! | Oneindia Telugu
కరోనా రాకుండా తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శభాష్ అన్న కేంద్రమంత్రి

కరోనా రాకుండా తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శభాష్ అన్న కేంద్రమంత్రి

కరోనా వ్యాప్తి చెందకుండా తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శభాష్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి, నమోదైన కేసులు... తదితర అంశాలపై కేంద్ర మంత్రికి మంత్రి, అధికారులు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ కోవిడ్-19ను నియంత్రించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తుందని చెప్పారు. మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణాను అనుసరించాలని హర్షవర్ధన్ సూచించారు. కరోనా వైరస్ విషయంలో ఎన్‌-95 మాస్క్‌లను అందించాలని, మరో కరోనా ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు మంత్రి ఈటెల రాజేందర్ .

English summary
Union Health and Family Welfare Minister Harshavardhan commended the Telangana state government's efforts in controlling the corona virus. He spoke to Telangana Health Minister Etela Rajender, Special Chief Secretary Shanthakumari and Commissioner Family Welfare Yogita Rana during a video conference with Health Ministers of all states on the current state of coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X