• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బండి సంజయ్ టీమ్: కొత్త కార్యవర్గం: ఎవరెవరు..ఎంతమంది: జాబితా ఇదే: మహిళలపై చిన్నచూపు

|

హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన అద్భుత ఫలితాల అనంతరం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చినా.. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని దెబ్బకొట్టేలా వ్యూహాలను రూపొందింంచుకుంటోంది. ప్రస్తుతం బీజేపీ నేతల దృష్టి మొత్తం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మీదే నిలిచింది.

  గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తాం- బండి సంజయ్
  క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం..

  క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం..

  నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఘన విజయాన్ని సాధించి.. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్‌లో సాధించిన ఫలితాలు గాలివాటం కాదని నిరూపించుకోవాలని భావిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సమాయాత్తమౌతోంది. తాజాగా నిర్వహిస్తోన్న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు కమలనాథులు. బలమైన టీఆర్ఎస్ కోటను బద్దలు కొట్టడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునే పనిలో పడ్డారు. గెలుపే లక్ష్యంగా.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

  మహిళలు ముగ్గురే..

  మహిళలు ముగ్గురే..

  ఈ క్రమంలో 38 మంది సభ్యులతో కూడిన కొత్త కార్యవర్గాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు. ఏఏ జిల్లాలకు చెందిన నాయకులను కార్యవర్గంలోకి తీసుకున్నారనే విషయాన్ని ఇందులో పొందుపరిచారు. 38 మంది కొత్త కార్యవర్గ సభ్యుల్లో ముగ్గురు మహిళలకు మాత్రమే అవకాశం కల్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మహిళ నాయకుల ప్రాతినిథ్యాన్ని తగ్గించడం పట్ల అసంతృప్తి వ్యక్తమౌతోంది.

  పూర్తి జాబితా ఇదే..

  ఆదిలాబాద్-అంకత్ రమేష్, మురళీధర్ థాక్రే, మంచిర్యాల-ముల్కల మల్లారెడ్డి, రంగారావు, నిర్మల్-ఓం ప్రకాష్ లడ్డా, కొమరం భీమ్ ఆసిఫాబాద్-డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, వై కృష్ణకుమారి, నిజామాబాద్-ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, దినేష్ కులచారి, కామారెడ్డి-బానాల లక్ష్మారెడ్డి, నీలం చిన్న రాజులు, కరీంనగర్-కొరటాల శివరామకృష్ణ, కాటంగూరి అనిల్ రెడ్డి, జగిత్యాల-బాజోజి భాస్కర్, శంబారి ప్రభాకర్, రాజన్న సిరిసిల్ల-ఏ రమాకాంత్ రావు, ఎర్రం మహేష్, సంగారెడ్డి-బీ రాజేశ్వర రావు దేశ్‌పాండే, ఏ విష్ణువర్ధన్ రెడ్డి, మెదక్-నందు జనార్ధన్ రెడ్డి, గోపీ, సిద్ధిపేట్-నాయిని నరోత్తమ్ రెడ్డి, అంబటి బాలేష్ గౌడ్, రంగారెడ్డి అర్బన్-కాసాని జ్ఙానేంద్ర ప్రసాద్, కల్లెం రవీందర్ రెడ్డి, రంగారెడ్డి రూరల్- గోగిరెడ్డి లచ్చిరెడ్డి, శ్రీరాములు, వికారాబాద్-కరణం ప్రహ్లాద్ రావు, కోటగిరి శివరాజ్, మేడ్చల్ అర్బన్-అర్సనపల్లి సూర్యారావు, వాసంశెట్టి శ్రీనివాస్, మేడ్చల్ రూరల్-బీ శ్రీనివాసులు, నల్లగొండ-నూకల నరసింహా రెడ్డి, పీ శ్యామ్ సుందర్ యాదవ్, సూర్యాపేట్-కడియం రామచంద్రయ్య, యాదాద్రి భువనగిరి-పోతంశెట్టి రవీందర్, పాశం భాస్కర్, మహబూబ్ నగర్-జీ పద్మజా రెడ్డి, వనపర్తి-సబ్బిరెడ్డి వెంకట్ రెడ్డి, కృష్ణ, నాగర్ కర్నూల్-బీ సుబ్బారెడ్డి, జోగుళాంబ గద్వాల-ఎం శ్రీనివాస్ రెడ్డి, గడ్డం కృష్ణా రెడ్డి, నారాయణ్‌పేట్-జలంధర్ రెడ్డి, బీ కొండయ్య, వరంగల్ అర్బన్-గురుమూర్తి శివకుమార్, రాట్నం సతీష్షా, వరంగల్ రూరల్-కాచం గురుప్రసాద్, గుజ్జా సత్యనారాయణ రావు, జయశంకర్ భూపాల్లి-వెన్నంపల్లి పాపయ్య, చదువు రామచంద్రా రెడ్డి, జనగామ-సారికొండ విద్యాసాగర్ రెడ్డి, యూ ఉమేస్, మహబూబాబాద్-వేదవెల్లి రాజవర్ధన్ రెడ్డి, రాచకొండ కొమురయ్య, ములుగు-అజ్మీరా కృష్ణవేణి నాయక్, ఖమ్మం-డొంగాల సత్యనారాయణ, తక్కెళ్లపల్లి నరేందర్ రావు, భద్రాద్రి కొత్తగూడెం-జంపన సీతారామ రాజు, గుత్తా వెంకట కృష్ణంరాజు, గోల్కొండ-గోషామహల్- టీ అమర్ సింగ్, పాశం సురేందర్, భాగ్యనగర్-మలక్‌పేట్-జీ సుభాష్ చందర్‌జీ, వీ రామకోటేశ్వర్, మహంకాళి-సికింద్రాబాద్-టీ గోపాల్, జే రామకృష్ణ, హైదరాబాద్ సెంట్రల్- ఎన్ ప్రేమ్‌రాజ్, సీ నందకిశోర్ యాదవ్.

  English summary
  Bharatiya Janata Party Telangana State headed by Karim Nagar Lok Sabha member Bandi Sanjay, announces State Executive members list on Sunday Total 38 members placed in the list including three women leaders. బీజేపీ తెలంగాణ శాఖ కార్యవర్గ సభ్యుల నియామకం.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X