వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ ధర్నా

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ కార్మీకులకు మద్దతుగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని పార్టీ అధ్యక్షుడు లక్ష్మన్ పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్రంలోని అన్ని డిపోల ముందు కార్మీకులకు మద్దతుగా ఆందోళన చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈనేపథ్యంలోనే ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని బస్‌భవన్ వద్ద చేపట్టనున్న ధర్నా కార్యక్రమంలో లక్ష్మన్ పాల్గోనున్నట్టు చెప్పారు. సమ్మె విషయంలో నియతృత్వంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ పార్టీ మెడలు వంచడం ఒక్క బీజేపీకే సాధ్యం అవుతుందని అన్నారు.

ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో మౌన దీక్ష.. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదంటున్న జేఏసీఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో మౌన దీక్ష.. సమ్మెపై వెనక్కి తగ్గేది లేదంటున్న జేఏసీ

ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన వారిని నిర్భంధంలోకి తీసుకుని, భయాందోళనలకు గురి చేస్తుందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కూడ కొనసాగుతున్నాయని అన్నారు. అప్పటి ఉద్యమ స్పూర్తికి ఇప్పటికి టీఆర్ఎస్‌లో మార్పులు వచ్చాయని ఆయన ఫైర్ అయ్యారు. ప్రజల బలిదానాలన్ని కూడ నిర్వీర్యం అవుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ కబంధ హస్తాల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించేందుకు బీజేపీ నాంది పలుకుతుందని చెప్పారు.

 Telangana BJP dharna at bus depot

టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటీ ఆర్టీసీ కార్మీకుల త్యాగాలను ఈనాడు తుంగలో తొక్కుతున్నారని అన్నారు. ఒక్క నిర్ణయంతో 48వేల మంది కార్మీకులను తొలగించామని చెప్పడం లాంటీ దుశ్చర్యలతో కార్మికులపై ఆమానవీయంగా వ్వవహరిస్తుందని విమర్శించారు. సమైక్య పాలకులు కూడ ఇలాంటీ నిర్ణయం తీసుకోలేదని ఆయన గుర్తు చేశారు. ఆర్టీసీ ఆస్తిపై కన్నేసిన సీఎం కేసీఆర్ దాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ సాధన కోసం అన్ని వర్గాలు, కులాల ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. అందుకే ప్రజాస్వామిక తెలంగాణ సాధించేందుకు బీజేపీ పూనుకుందని అన్నారు..

English summary
Telangana BJP president Dr. laxman called for the dharna at bus depot.in support of the rtc employees strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X