India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసీఆర్‌పై స్కిట్‌.. తెలంగాణ బీజేపీనేత జిట్టా బాలకృష్ణారెడ్డి అరెస్ట్‌; బండి సంజయ్ మండిపాటు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో అధికార టిఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష బీజేపీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అధికారం సాధించాలని టిఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీని ఓడించి తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని బిజెపి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీపై బిజెపి తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతుంటే, బిజెపి నేతలపై కేసులు పెడుతూ వారిని అణచివేసే ప్రయత్నం చేస్తుంది టిఆర్ఎస్.

బీజేపీ రాష్ట్ర నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి అరెస్ట్

తాజాగా రాష్ట్ర బిజెపి నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేయడం బిజెపి వర్గాల ఆగ్రహానికి కారణంగా మారింది. సీఎం కేసీఆర్‌పై వ్యంగ్యంగా స్కిట్‌ వేయించినందుకు తెలంగాణ బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి అరెస్ట్‌ అయ్యారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును నటీనటుల స్కిట్ ద్వారా ఎగతాళి చేస్తూ, ప్రతికూలంగా చిత్రీకరించిన కారణంగా రాష్ట్ర బిజెపి నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని శుక్రవారం అరెస్టు చేశారు.

సినీ ఫక్కీలో జిట్టా అరెస్ట్.. బీజేపీ నేతల ఆగ్రహం

సినీ ఫక్కీలో జిట్టా అరెస్ట్.. బీజేపీ నేతల ఆగ్రహం

హయత్‌నగర్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున జిట్టా బాలకృష్ణ రెడ్డిని అరెస్టు చేసి, ఐపిసి సెక్షన్‌లు 114 , 504 (శాంతి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశ్యపూర్వకంగా అవమానించడం), 505 (2), R/w 109 కింద కేసునమోదు చేశారు. జిట్టాను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో కూడా చెప్పకుండా ఆయనను తీసుకెళ్ళారు పోలీసులు . బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని ఫాలో అయినప్పటికీ వారి కళ్ళు గప్పి జిట్టాను తీసుకువెళ్ళారు . దీనిపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిట్టా అరెస్ట్ పై పోలీసులు చెప్పిందిదే

జిట్టా అరెస్ట్ పై పోలీసులు చెప్పిందిదే

పోలీసులు ఒక ప్రకటనలో, "జూన్‌లో, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, రాష్ట్ర బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో, జిట్టా బాలకృష్ణారెడ్డి మరియు రాణి రుద్రమ ఒక కార్యక్రమాన్ని నిర్వహించి, వేదికపై సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి ద్వేషపూరిత స్కిట్ ను ప్రదర్శించారని చెప్పారు . రాష్ట్ర ప్రజలచే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని అవమానించారని, ఆ స్కిట్ టీవీలలో సైతం ప్రదర్శించబడింది అని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో వీడియో ఫుటేజీతో పాటు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించి విద్వేషం మరియు అశాంతిని రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో ఈ చర్యకు పాల్పడ్డారని చేసిన ఫిర్యాదుతో జిట్టా బాలకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

జిట్టా అరెస్ట్ పై మండిపడిన బండి సంజయ్.. విడుదల చెయ్యాలని డిమాండ్

జిట్టా అరెస్ట్ పై మండిపడిన బండి సంజయ్.. విడుదల చెయ్యాలని డిమాండ్

ఇక జిట్టా బాలకృష్ణా రెడ్డి అరెస్ట్ పై బండి సంజయ్ మండిపడ్డారు. జిట్టాను అర్దరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులివ్వకుండా అర్ధరాత్రి కిడ్నాప్ చేసి తీసుకెళ్లడమేంటని బండి సంజయ్ మండిపడ్డారు. వెంటనే జిట్టాను విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. జిట్టాకు ఏం జరిగినా కేసీఆర్ ప్రభుత్వం, పోలీసులే పూర్తి బాధ్యత వహించాలని బండి సంజయ్ తేల్చి చెప్పారు.

English summary
State BJP leader Jitta Balakrishna Reddy has been arrested by the police. Telangana BJP leader Jitta Balakrishnareddy has been arrested for making a sarcastic skit on CM KCR. BJP Telangana chief Bandi Sanjay condemns Jitta's arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X