వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విలయం..కేసీఆర్ ఫిడేల్ వాయింపు.. 8వ నిజాం మసీదు ప్లాన్.. మోదీ,షాకు టీబీజేపీ మొర..

|
Google Oneindia TeluguNews

''కొవిడ్-19 కేసులకు సంబంధించి దేశంలోనే అత్యధిక పాజిటివ్ రేటుతో తెలంగాణ డేంజర్ లో ఉంది. ప్రజలను గాలికొదిలేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించకుండా పోయారు. #WhereisKcr అని జనం ప్రశ్నిస్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉలుకూ పలుకూ లేదు. ఓదిక్కు కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంటే, దాన్ని వదిలేసి అర్జెంటుగా సచివాలయాన్ని కూల్చేయాల్సిన ఆవశ్యకత ఏంటి? రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా కరోనా క్రైసిస్ లో కేసీఆర్ చేపట్టిన పని.. రోమ్ నగరం తగలబడుతోంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా ఉంది..'' అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.

కేసీఆర్ కు కరోనా పాజిటివ్.. అసలు కథ.. భయానక పాజిటివ్ రేటు.. రంగంలోకి కేంద్రం?కేసీఆర్ కు కరోనా పాజిటివ్.. అసలు కథ.. భయానక పాజిటివ్ రేటు.. రంగంలోకి కేంద్రం?

చారిత్రక భవంతి నేలమట్టం..

చారిత్రక భవంతి నేలమట్టం..

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ పక్కనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవంతుల కూల్చివేత పనులు మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ భద్రత నడుమ టెక్నాలజీ సాయంతో, ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనులు సాగుతున్నాయి. విభజన చట్టంలో తనకు దక్కిన భవంతుల్ని ఏపీ సర్కారు ఇప్పటికే తెలంగాణకు అప్పగించడం తెలిసిందే. 132 ఏళ్ల చాత్రిక భవంతిని నేలమట్టం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేయడంతో కూల్చివేత పనులకు ఇబ్బందులు తొలగిపోయాయి. కొత్త నిర్మాణాలకు సంబంధించి గత నెల 27నే సీఎం కేసీఆర్ భూమిపూజ నిర్వహించారు.

ముందుగా కేసీఆర్ ఆఫీసునే..

ముందుగా కేసీఆర్ ఆఫీసునే..

25 ఎకరాల విస్తీర్ణంలో10లక్షల చదరపు అడుగుల్లో నిర్మితమైన ఈ భవంతి నుంచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలుపుకొని మొత్తం 16 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. 1888లో ఆరవ నిజాం నవాబు జీ బ్లాక్ భవంతిని నిర్మించగా, గడిచిన 132 ఏళ్ల కాలంలో మొత్తం 10 బ్లాకులను విస్తరించారు. 2003లో డి బ్లాక్, 2012లో నార్త్, సౌత్ బ్లాక్ ప్రారంభమయ్యాయి. బేగంపేటలో ప్రగతిభవన్ కట్టకముందు తెలంగాణ సీఎం కేసీఆర్ విధులు నిర్వహించిన ‘సి బ్లాక్'నే ముందుగా నేలమట్టం చేయడం గమనార్హం. కూల్చివేత పనులు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే కొత్తగా నిర్మించబోయే భవన నమూనాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పరిణామాలపై తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రవిమర్శలకు దిగారు.

మసీదు కడుతున్నారా?

మసీదు కడుతున్నారా?

‘‘నిజాం రాజులు తమ పేరు చిరకాల గుర్తుండిపోయేలా హైదరాబాద్ లో పలు భవంతులు నిర్మించారు. 8వ నిజాం నవాబైన సీఎం కేసీఆర్ కూడా అదే కోరికతో ముందుకు పోతున్నారు. ఇప్పుడున్న సచివాలయాన్ని కూల్చేసి, కొత్తగా కట్టబోయే బిల్డింగ్ డిజైన్.. మసీదును పోలి ఉంది. అంటే సెక్రటేరియట్ కూల్చేసి మసీదు కడుతున్నారా? యూపీలో నిర్మిస్తోన్న ఓ హజ్ బిల్డంగ్ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి డిజైనే ఉంది. ఇంతకీ ఈ డిజైన్ ను ఎంఐఎం వాళ్లు ఖరారు చేసిందేనా? ప్రజల సొమ్ముతో ఆటలొద్దు'' అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు.

మోదీ, షాను ట్యాగ్ చేస్తూ..

మోదీ, షాను ట్యాగ్ చేస్తూ..

కరోనా ఉధృతంగా వ్యాపిస్తున్నవేళ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్ని పట్టించుకోకుండా, సచివాలయం భవంతి కూల్చివేతకు ప్రాధాన్యం ఇస్తున్న తీరును టీబీజేపీ నేతలు.. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లారు. సచివాలయం కూల్చివేతకు సంబంధించిన పోస్టుల్లో మోదీ, షా, నడ్డాలను ట్యాగ్ చేశారు. కరోనా వేళ సచివాలయాన్ని కూల్చకుండా, దాన్ని ఆస్పత్రిగా వాడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇదివరకే సలహా ఇచ్చారు.

షాకింగ్: చైనా పైచేయి.. గాల్వాన్ స్వాధీనం? చర్చల్లో భారత్ అంగీకరించిందా? డ్రాగన్ సైన్యం తిరిగొస్తే?షాకింగ్: చైనా పైచేయి.. గాల్వాన్ స్వాధీనం? చర్చల్లో భారత్ అంగీకరించిందా? డ్రాగన్ సైన్యం తిరిగొస్తే?

English summary
as Telangana old secretariat building demolition begins tuesday, the bjp leaders raja singh, dharmapuri arvind slams cm kcr for taking up this issue when coronavirus crisis at high level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X