• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కేసీఆర్ ఫాంహౌస్‌కు కరెంట్ కట్ చేస్తాం: బీజేపీపైనా తొలిసారి విరుచుకుపడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

|

కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీఎస్పీ రాష్ట్ర సమన్వయ కర్త, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గురువారం కరీంనగర్‌లో నిర్వహించిన బీఎస్పీ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. బహుజన రాజ్యంలో బడుగులే పాలకులవుతారన్నారు.

కేసీఆర్ అసెంబ్లీని రేపే రద్దు చేయొచ్చన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కేసీఆర్ అసెంబ్లీని రేపే రద్దు చేయొచ్చన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ సీఎం కేసీఆర్ రేపే అసెంబ్లీ రద్దు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. బూతులు మాట్లాడేవాళ్లకు వర్సిటీలు ఇస్తున్నారని పరోక్షంగా మంత్రి మల్లారెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఇక బీజేపీపైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందం: బీజేపీ డ్రామాలన్న ప్రవీణ్ కుమార్

టీఆర్ఎస్‌తో లోపాయికారి ఒప్పందం: బీజేపీ డ్రామాలన్న ప్రవీణ్ కుమార్

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు బుద్ధి చెప్పేందుకు రూ. 100 కోట్లు ఖర్చు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హుజూరాబాద్ డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు. ఈ డ్రామాలో బీజేపీ కూడా అద్భుతంగా నటిస్తోందని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. టీఆర్ఎస్‌తో లోపాయకారి ఒప్పందం చేసుకున్న బీజేపీ.. మొన్న దుబ్బాకలో.. ఇప్పుడు హుజూరాబాద్‌లో నాటకాలాడుతోందని విమర్శించారు.

కేసీఆర్ ఫాంహౌస్‌కు కరెంట్ కట్ చేస్తామన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కేసీఆర్ ఫాంహౌస్‌కు కరెంట్ కట్ చేస్తామన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎవరు గెలిచినా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని అన్నారు. తెలంగాణలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 18 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నిరుద్యోగులు ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని ప్రవీణ్ కుమార్ కోరారు. ఎన్నికలు వస్తేనే నోటిఫికేషన్లు వస్తాయా? జోనల్ నిబంధనలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మూడేళ్లు పడుతుందా? అని ప్రశ్నించారు. తన సభలకు అధికార పార్టీ కరెంట్ తీసేస్తోందని.. తాము అధికారంలోకి వస్తే.. కేసీఆర్ ఫాంహౌస్‌కు కరెంట్ కట్ చేస్తామన్నారు.

తొలిసారి బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తొలిసారి బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఎస్పీలో చేరిన నాటి నుంచీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా, బీజేపీ, ఆ పార్టీ నేతలపైనా విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ దళిత నేతలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల వరంగల్ జిల్లా పర్యటనలోనూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాబోయేది బహుజన రాజ్యమేనని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలదే రాజ్యాధికారమని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇప్పటి వరకూ పాలకులు దోచుకున్న వేల కోట్ల డబ్బులను గల్లా పట్టి తీసుకొస్తామని.. వాటిని వైద్యం, విద్య, ఉపాధి కల్పనకు ఖర్చు చేస్తామని వ్యాఖ్యానించారు. అంతేగాక, ప్రగతి భవన్‌ను బహుజన భవన్‌గా మారుస్తామన్నారు ప్రవీణ్ కుమార్. మనకి కావాల్సింది గులాబీ తెలంగాణ కాదని.. నీలి తెలంగాణ కావాలన్నారు. ఏనుగు గుర్తును గెలిపించాలని బహుజన దేవతలను పూజించాలని పిలుపునిచ్చారు. తాము కాన్షీరాం , అంబేద్కర్ వారసులమని.. మడమ తిప్పడం, మాట తప్పడం తమకు తెలియదన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాజ్యంగా రాసిందే మా తాత అంబేద్కర్ అని.. బీసీలు, ఎస్సీ, ఎస్టీలే భవిష్యత్‌లో పాలకులు అవుతారని ప్రవీణ్ చెప్పుకొచ్చారు. దళితులను ఈ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. ఒకానొక ఎమ్మెల్యే దళితులకు చదువురాదని అవమానించారని ప్రవీణ్ గుర్తుచేశారు. కానీ, మా బిడ్డలు ఇంజనీర్లు, లాయర్లు, డాక్టర్లుగా ఉన్నారని.. వారే పాలకులు కాబోతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

English summary
Telangana BSP leader RS Praveen Kumar slams cm kcr and bjp leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X