వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Telangana Budget: 2020-2021 తెలంగాణ బడ్జెట్ ఎంతో తెలుసా..? ఈ రంగాలకే సింహభాగం..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ బడ్జెట్ 2020-2021 ఆర్థిక సంవత్సరానికి రూ.1.56 నుంచి రూ.1.59 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాదించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అభివృద్ది లక్ష్యాలు, ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ సర్కార్ బడ్జెట్ రూపొందించినట్టు సమాచారం. 2019-2020లో బడ్జెట్ రూ.1.46 లక్షల కోట్లు కాగా.. 15నుంచి 16 శాతం బడ్జెట్ వ్యయం పెరిగే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో శనివారం రాత్రి జరిగిన క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.

Recommended Video

Telangana Budget 2020: These Sectors To Benefit The Most
ఇటు హరీశ్, అటు ప్రశాంత్

ఇటు హరీశ్, అటు ప్రశాంత్

ఆదివారం ఉదయం 11.30 గంటలకు శాసనసభలో విత్త మంత్రి హరీశ్ రావు, మండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. గతేడాది బడ్జెట్ వ్యయం 1.46 లక్షల కోట్లు కాగా.. అందులో రూ.10 వేల కోట్ల భూముల అమ్మకాల ద్వారా వచ్చే రాబడి అంచనాలుగా లెక్కగట్టింది. దీంతో బడ్జెట్ రూ.1.36 లక్షల కోట్లు అని పేర్కొంది. 2020-2021 ఏడాదికి రూ.1.70 లక్షల కోట్లతో బడ్జెట్ రూపొందించే అంశంపై ప్రభుత్వం పరిశీలన చేసినా.. 16 శాతం పెంపునకు మాత్రమే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.

ఇవే కీలకం..

ఇవే కీలకం..


ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను ప్రయారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సంక్షేమం, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినట్టు సమాచారం. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు దండీగా నిధులు కేటాయిస్తారు. సాగు, తాగునీటి రంగాలకు కూడా కేటాయింపులు పెరగనున్నాయి. ఆసరా పెన్షన్ల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించనున్న నేపథ్యంలో లబ్దిదారుల సంఖ్య 7 లక్షలకు పెరగనుంది. దీంతో పెన్షన్ల నిధులు రూ.12 వేల కోట్ల కంటే ఎక్కువ కేటాయించాల్సి వస్తోంది.

పల్లె, పట్టణ ప్రగతికి కూడా..

పల్లె, పట్టణ ప్రగతికి కూడా..

డబుల్ బెడ్ రూం ఇళ్లను 2.7 లక్షలు ప్రతిపాదించగా.. బడ్జెట్‌లో లక్ష ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు సమాచారం. రుణమాఫీ కోసం బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు ప్రతిపాదించారు. అయితే మొత్తం వ్యయం కానందున.. వచ్చే నాలుగేళ్లలో రైతు రుణమాఫీ పూర్తి చేసేలో బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు ప్రతిపాదించనున్నట్టు తెలిసింది. ఉద్యోగుల వేతన సవరణ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాల్సి ఉంటుంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి ప్రత్యేకంగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

రూ.10 వేల కోట్లు

రూ.10 వేల కోట్లు

సాగునీటి రంగానికి రూ.10 వేల కోట్ల నిధులు కేటాయించే అవకాశం ఉంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకొనే రుణం కాకుండా ఈ మొత్తం కేటాయిస్తారు. ప్రాజెక్టులకు తీసుకొచ్చే రుణాలకు మార్టిన్ మనీ, వడ్డీల చెల్లింపు కోసం బడ్జెట్‌లోనే కేటాయింపులు చేస్తారు. 2018-19లోనే రూ.25 వేల కోట్ల కేటాయించిన ప్రభుత్వం.. 2019-2020 నుంచి ఎక్కువ రుణాలను వ్యయం చేస్తోంది.

English summary
Telangana Budget 2020: do you know telangana 2020-2021 budget
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X