వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ్యానిఫెస్టో లక్ష్యం బ్యాలెట్ బాక్సులు కావొద్దు.. బతుకు నిలబెట్టాలి.. హరీష్ ఎమోషనల్ స్పీచ్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020-21 సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు వరాల జల్లు కురింపించారు. ప్రధానంగా రైతు సంక్షేమం దిశగా బడ్జెట్ రూపకల్పన జరిగినట్టు హరీష్ బడ్జెట్ ప్రసంగం చూస్తే స్పష్టమైంది. బడ్జెట్ ప్రసంగంలో హరీష్ రైతులకు ప్రకటించిన వరాలు ఇవే..

Recommended Video

Telangana Budget 2020 Highlights: Here Is The Budget Allocations For Each Sector
సమైక్య రాష్ట్రంలో తీవ్ర

సమైక్య రాష్ట్రంలో తీవ్ర

సమైక్య రాష్ట్రంలో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర వ్యవసాయభివృద్ది విధానం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పౌరులుగా మనకు గర్వకారణం అని హరీష్ అన్నారు.

ప్రజల బతుకు నిలబెట్టాలి

ప్రజల బతుకు నిలబెట్టాలి

ఎన్నికల మ్యానిఫెస్టో లక్ష్యం కేవలం బ్యాలెట్ బాక్సులు మాత్రమే కాకూడదు. ప్రజల బతుకు నిలబెట్టడం కావాలనేది సీఎం కేసీఆర్ నమ్మిన సిద్ధాంతం. అందుకే ఎన్నికల సందర్భంగా ఆచరణకు సాధ్యమైన హామీలనే టీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. ప్రజలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నది. రైతుల రుణమాఫీ అందులో ముఖ్యమైనది అని హరీష్ రావు పేర్కొన్నారు.

లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని

2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో రూ.1 లక్ష లోపు రైతు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామనిని టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. అందుకనుగుణంగా రూ.16,124 కోట్ల మేర రుణాలను పూర్తిగా మాఫీ చేసింది. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ రైతులకు గత ఎన్నికల్లో కూడా రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చాం అని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు.

ఆర్థిక మాంద్య ప్రభావంతో

ఆర్థిక మాంద్య ప్రభావంతో

ప్రతికూల పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాలని ప్రయత్నిస్తున్నాం. ఆర్థిక మాంద్యం ముందర కాళ్లకు బంధం వేస్తున్నప్పటికీ లెక్క చేయకుండా రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రుణ మాఫీని అమలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది అని హరీష్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. రైతులను ఆకర్షించే విధంగా హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం కొనసాగింది.

English summary
Telangana Budget 2020-21 News, Budget Speech & Highlights in Telugu: Telanagna Minister Thaneeru Harish Rao introduced TS Budget 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X