వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ సర్కార్ వరం: 57 ఏళ్లకే ఇకపై పెన్షన్లు.. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వం 2020-21 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. మొత్తం రూ.1,82,914.42 కోట్లతో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రజాసంక్షేమం రైతు సంక్షేమంకు పెద్ద పీట వేస్తోందని వెల్లడించారు. అన్ని వర్గాల వారికి ఈ బడ్జెట్‌తో న్యాయం జరుగుతుందని మంత్రి హరీష్ రావు చెప్పారు. రైతులకు పూర్తిగా రుణమాఫీలు చేస్తామని చెప్పిన మంత్రి హరీష్ రావు... వృద్ధాప్య పెన్షన్ల వయస్సును 60 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. వారికిచ్చే పెన్షను ఈ ఆర్థిక సంవత్సరం నుంచే వస్తుందని వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని వెల్లడించారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ సురక్షితమైన త్రాగునీటిని అందిస్తున్నట్లు చెప్పారు. అదేసమయంలో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేయడం మంచి ఫలితాలను ఇస్తోందని చెప్పారు. ఇక హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం ముగియగానే... సమావేశాలను బుధవారంకు వాయిదా వేశారు స్పీకర్ పోచారం.

Recommended Video

    Telangana Budget 2020 Highlights: Here Is The Budget Allocations For Each Sector

    ఇక ఈ రోజు మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల హైలైట్స్ ఇలా ఉన్నాయి.

    Telangana Budget 2020 live updates:Will it attract common man?

    Newest First Oldest First
    12:51 PM, 8 Mar

    ముగిసిన మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం..బుధవారానికి సభ వాయిదా వేసిన స్పీకర్
    12:40 PM, 8 Mar

    2019-20కి గాను మైనార్టీల కోసం కేటాయించిన రూ.1369 కోట్లు నిధులు వారి సంక్షేమం కోసం ఈ నెలాఖరులోగ ఖర్చు చేయడం జరుగుతుంది: మంత్రి హరీష్ రావు
    12:39 PM, 8 Mar

    మైనార్టీ విద్యార్థుల కోసం 204 గురుకుల విద్యాలయాలు నడుపుతోంది: మంత్రి హరీష్ రావు
    12:38 PM, 8 Mar

    మసీదుల్లో ప్రార్థనలు జరిపే ఇమామ్ మౌజామ్‌లకు ప్రభుత్వం రూ.5వేల గౌరవవేతనం అందిస్తోంది:మంత్రి హరీష్ రావు
    12:37 PM, 8 Mar

    ఎస్టీల ప్రత్యేక ప్రగతినిధి కోసం రూ.9771.27 కోట్లు కేటాయింపులు: మంత్రి హరీష్ రావు
    12:36 PM, 8 Mar

    ఎస్సీల ప్రత్యేక ప్రగతినిధి కోసం రూ.16,534.97 కోట్లు కేటాయింపులు: మంత్రి హరీష్ రావు
    12:33 PM, 8 Mar

    మిషన్ కాకతీయలో భాగంగా 46వేల చెరువుల పునరుద్ధరణ మంచి ఫలితాలను ఇచ్చింది
    12:32 PM, 8 Mar

    సాగునీటి పారుదల రంగానికి ఈ బడ్జెట్‌లో రూ. 11,054 కోట్లు కేటాయిస్తున్నాం: హరీష్ రావు
    12:31 PM, 8 Mar

    మెదక్ జిల్లాలో సింగూరు కాల్వల నిర్మాణాన్ని పూర్తి చేసి 40వేల ఎకరాలకు సాగునీరు అందించింది: మంత్రి హరీష్ రావు
    12:30 PM, 8 Mar

    త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం: మంత్రి హరీష్ రావు
    12:29 PM, 8 Mar

    రైతు వేదికల నిర్మాణం కోసం రూ. 350 కోట్లు కేటాయింపులు
    12:28 PM, 8 Mar

    డ్రిప్ ఇరిగేషన్‌పై సబ్సీడీ ఇవ్వడంతో 2,49,200 మంది రైతులకు దాదాపు రూ. 1819 కోట్లు లబ్ధి చేకూరడమైంది: మంత్రి హరీష్ రావు
    12:26 PM, 8 Mar

    డ్రిప్ ఇరిగేషన్ కోసం ఎస్సీ ఎస్టీలకు 100శాతం సబ్సీడీ ఇస్తుండగా..బీసీలు సన్న, చిన్న కారు రైతులకు 90శాతం ఇతరులకు 80శాతం సబ్సీడీ ఇస్తున్నాం: హరీష్ రావు
    12:23 PM, 8 Mar

    మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కోసం రూ. 1000 కోట్లు కేటాయింపులు
    12:23 PM, 8 Mar

    రైతులు పండించే పంటకు మద్దతు ధర లభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది: మంత్రి హరీష్ రావు
    12:18 PM, 8 Mar

    కరోనావైరస్ రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది: మంత్రి హరీష్ రావు
    12:17 PM, 8 Mar

    నాలుగు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించాం. ఇప్పుడు ఆ సంఖ్య 9కి చేరింది:మంత్రి హరీష్ రావు
    12:14 PM, 8 Mar

    విదేశాల్లో చదువుతున్న ఎస్సీ,ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.20 లక్షలు స్కాలర్షిప్ ఇస్తోంది:మంత్రి హరీష్ రావు
    12:13 PM, 8 Mar

    ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నిధికి రూ.480 కోట్లు కేటాయింపులు
    12:12 PM, 8 Mar

    పంచాయతీరాజ్ రూ. 23005 కోట్లు కేటాయింపులు
    12:11 PM, 8 Mar

    రూ.లక్షా 9వేలకు పెరిగిన ఐటీ ఎగుమతులు: మంత్రి హరీష్ రావు
    12:08 PM, 8 Mar

    ఈ ఆర్దిక సంవత్సరం నుండి 57 ఏళ్లకు పెన్షన్ సదుపాయం
    12:08 PM, 8 Mar

    ఆర్దిక లోటు రూ. 33,191.25 కోట్లు
    12:08 PM, 8 Mar

    రెవిన్యూ మిగులు రూ. 4,482.12 కోట్లు
    12:08 PM, 8 Mar

    క్యాపిటల్ వ్యయం రూ. 22,061.18 కోట్లు కేటాయింపులు
    12:07 PM, 8 Mar

    రెవిన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు
    12:07 PM, 8 Mar

    2020-21 మొత్తం బడ్జెట్ అంచనా 1,82,914.42 కోట్లు
    12:05 PM, 8 Mar

    ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి డెవలప్ మెంట్ ఫండ్ కింద రూ 3 కోట్లు కేటాయింపులు
    12:05 PM, 8 Mar

    పోలీసు శాఖ కోసం రూ. 5,852 కోట్లు కేటాయింపులు
    12:05 PM, 8 Mar

    రోడ్లు భవనాల శాఖ రూ. 3,494 కోట్లు కేటాయింపులు
    READ MORE

    English summary
    Telangana government will be presenting its annual budget for 2020-21 in the Assembly today. Finance Minister Harish Rao will present the budget.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X