వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Telangana Budget 2020:హరీశ్ రావుకు కేసీఆర్ ప్రత్యేక అభినందనలు, ఏమన్నారంటే..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్ రావును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభినందించారు. 2020-21 సంవత్సరానిిక హరీశ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి సమతౌల్యంగా ఉందని కేసీఆర్ ప్రసంశించారు. సంక్షేమ తెలంగాణ కోసం రచించిన ప్రగతిశీల బడ్జెట్‌గా ఆయన అభివర్ణించారు.

Recommended Video

Telangana Budget 2020 Highlights: Here Is The Budget Allocations For Each Sector
బడ్జెట్‌పై ప్రశంసలు

బడ్జెట్‌పై ప్రశంసలు

ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆదివారం తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆదాయ వనరులు, తెలంగాణ ప్రజల అవసరాలకు మధ్య సమతౌల్యం పాటించిన వాస్తవిక బడ్జెట్ అంటూ కొనియాడారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం వేసుకున్న ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులన్నాయని అన్నారు.

ఢోకాలేదంటూ అభినందనలు

ఢోకాలేదంటూ అభినందనలు

తెలంగాణ గ్రామాలు, పట్టణాల వికాసం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు, సంక్షేమ పథకాల్లో మరింత మంది పేదలకు అవకాశం రావాలనే సంకల్పానికి, ఎన్నికల హామీల అమలుకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారని కితాబిచ్చారు.

దేశంలో ఆర్థిక మాంద్యం కారణంగా రాబడులు తగ్గి, కేంద్రం నుంచి వచ్చే నిధులు కోతల పడినప్పటికీ రాష్ట్రాభివృద్ధికి ఢోకాలేకుండా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం అభినందనీయమని కేసీఆర్ కొనియాడారు.

వారికి కేసీఆర్ ప్రత్యేక అభినందనలు

వారికి కేసీఆర్ ప్రత్యేక అభినందనలు

కాగా, అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టగా.. శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ ఇద్దరు మంత్రులతోపాటు బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకున్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.

భారీ బడ్జెట్ ఇలా..

భారీ బడ్జెట్ ఇలా..

2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,914 కోట్ల అంచనాలతో బడ్జెట్ రూపొందించారు. రెవెన్యూ వ్యయం రూ. 1,38,669.82 కోట్లు, పెట్టుబడి వ్యవయం రూ. 22,06,061.18 కోట్లు, రెవెన్యూ మిగులు రూ. 4,482.18 కోట్లు, ఆర్థిక లోటు రూ. 33,191.25కోట్లుగా ఉంది. ఆర్థిక మాంద్యం ప్రభావం, రాష్ట్ర పన్నులు, పన్నేతర ఆదాయంపై పడింది. ఇతర సంక్షే, అభివృద్ధికి కేటాయింపులు ఇలా..

ఎంబీసీ సంక్షేమ అభివృద్దికి రూ.500కోట్లు
కల్యాణ లక్ష్మీ,షాదీ ముబాకర్ కోసం రూ.350కోట్లు
ఎస్సీ సెల్ డెవలప్‌మెంట్ కోసం రూ.16,354కోట్లు
మైనారిటీ అభివృద్దికి రూ.1518కోట్లు
మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.1200కోట్లు
మున్సిపల్ శాఖకు రూ.14809కోట్లు
పాఠశాల విద్యకు రూ.10421కోట్లు
ఉన్నత విద్యకు రూ.1700కోట్లు
ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.2650కోట్లు
మత్స్యకారులకు రూ.1586కోట్లు
ఎస్టీ సెల్ డెవలప్‌మెంట్ కోసం రూ.4356కోట్లు
పోలీస్ శాఖకు రూ.5852కోట్లు
రైతు రుణమాఫీకి రూ.6226కోట్లు
మెక్రో ఇరిగేషన్ కోసం రూ.600కోట్లు
సాగునీటి పారుదల కోసం రూ.11054కోట్లు
రైతు బంధుకు రూ.14000కోట్లు
గృహ నిర్మాణాలకు రూ.11వేల కోట్లు
విత్తనాల సబ్సిడీ రూ.142కోట్లు.
హైదరాబాద్ అభివృద్ధి కోసం రూ.10వేల కోట్లు.

English summary
Telangana Budget 2o2o: cm KCR congratulated minister harish rao
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X