వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Telangana Budget 2o2o: ఈ పరిస్థితిలో నిరుద్యోగ భృతి? ‘నో’.. వచ్చే ఏడాది కూడా!?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఈసారి కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. రూ. 1,82,914 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ నిరుద్యోగులకు మాత్రం ఎలాంటి కేటాయింపులు లేవు. నిరుద్యోగ భృతిపై బడ్జెట్‌కు ఒక రోజు ముందే సీఎం కేసీఆర్ స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే.

నిరుద్యోగ భృతి లేదు.. వచ్చే ఏడాదీ..

నిరుద్యోగ భృతి లేదు.. వచ్చే ఏడాదీ..

శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతిపై స్పందించారు. ఈ ఏడాది నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. అయితే, వచ్చే ఏడాది కూడా నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి లేనట్లే తెలుస్తోంది. ఇందుకు రాష్ట్ర ఆర్థికి పరిస్థితే కారణం కావడం గమనార్హం. పథకం అమలు కూడా కష్టసాధ్యంగా మారడంతో ప్రభుత్వం వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు సాధ్యం కాదు..

ఇప్పుడు సాధ్యం కాదు..

ఎన్నికల నిరుద్యోగ భృతి ఇస్తామన్న వాగ్ధానానికి తాము కట్టుబడి ఉన్నామని.. అయితే, ఆ వాగ్ధానం నెరవేర్చడానికి ఐదేళ్ల సమయం ఉందని చెప్పుకొచ్చారు సీఎం కేసీఆర్. నిరుద్యోగ భృతి ఇచ్చే అంశాన్ని వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతి ఏడాది అమలయ్యేలా చూస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలు భృతి ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు.

నిరుద్యోగ భృతిపై ఎన్నో ఆశలు..

నిరుద్యోగ భృతిపై ఎన్నో ఆశలు..

కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు రూ. 3016 చొప్పున భృతి కల్పిస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ అంశాన్ని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా పొందుపర్చారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో నిరుద్యోగులంతా భృతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే వారికి నిరాశే ఎదురైంది.

Recommended Video

Telangana Budget 2020: Rs 14,000 Crore for Rythu Bandhu | రైతుబంధు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదర్శం
ఇప్పుడున్న పరిస్థితిలో.

ఇప్పుడున్న పరిస్థితిలో.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నప్పటికీ నిరుద్యోగభృతి కల్పించకపోవడంపై నిరుద్యోగులు కొంత నిరాశకు గురయ్యారు. తాజా బడ్జెట్‌లో కూడా ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో నిరుద్యోగులు సర్కారుపై మండిపడుతున్నారు. అయితే, సర్కారు మాత్రం ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టి ఉంచుకుని నిరుద్యోగ భృతికి కేటాయింపులు జరపలేదని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది పరిస్థితులు బాగుంటే నిరుద్యోగ భృతి ఇచ్చే విషయంపై ఆలోచిస్తామని తెలిపింది.

English summary
Telangana Budget 2o2o: This year also no nirudyoga bruthi to unemployed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X