వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్చి 15 తర్వాత బడ్జెట్ సమావేశాలు... ఈసారి కేటాయింపులు ఎక్కువే... : సీఎం కేసీఆర్

|
Google Oneindia TeluguNews

గత బడ్జెట్‌ కంటే 2021-22 బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. మార్చి నెల మధ్యలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయని చెప్పారు.
ఆదివారం (మార్చి 6) నుంచి అన్ని శాఖల అధికారులతో బడ్జెట్‌పై ఆర్థికమంత్రి హరీశ్‌రావు సమావేశాలు జరుపుతారని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ శనివారం(మార్చి 5) హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌‌లో బడ్జెట్‌పై ఉ‍న్నతి స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో సీఎం కేసీర్‌ మాట్లాడుతూ.. ఈనెల 15 తర్వాత తెలంగాణ రాష్ట్ర 2021 -22 బడ్జెట్ స‌మావేశాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈసారి బడ్జెట్‌ ఆశాజనకంగా ఉంటుందని,గత బడ్జెట్ కంటే కేటాయింపులు ఎక్కువగానే ఉంటాయని చెప్పారు. సంక్షేమ,అభివృద్ధి పథకాలు కొనసాగుతాయన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర ఖజానాకు రూ.50వేల కోట్ల మేర ఆదాయం తగ్గిందన్నారు. మొత్తంగా రూ.1లక్ష కోట్లు వరకు నష్ట ప్రభావం ఉందన్నారు.

telangana budget session will begin after march 15th says cm kcr

కొద్ది నెలలుగా రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మళ్లీ పుంజుకోవడంతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతోందని కేసీఆర్ అన్నారు. ఈ ఏడాది కూడా గొర్రెల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.రాష్ట్రంలో ఇప్పటికే 3.70లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశామని... మరో 3లక్షల యూనిట్ల పంపిణీకి బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తామని వెల్లడించారు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుందని గుర్తుచేశారు. దేశంలోనే అత్యధికంగా గొర్రెలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తున్నదని కేంద్రం గుర్తించిందన్నారు.చేపల పెంపకంలో సత్ఫలితాలు వస్తున్నాయని... కాబట్టి దాన్ని కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

సమీక్ష సమావేశంలో ఆయా శాఖల అధికారులు అందించిన ఆర్థిక నివేదికలను సీఎం కేసీఆర్‌ పరిశీలించారు. బడ్జెట్ అంచనాలు,కేటాయింపులు,విధి విధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ స‌మావేశంలో ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ రావు, ఆర్ధిక సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్ధికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్టారావు, కార్యదర్శి రోనాల్డ్ రాస్, సీఎంవో అధికారులు భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్, తదితరులు పాల్గొన్నారు.

English summary
Telangana Chief Minister KCR said that the 2021-22 budget will be more promising than the last budget. He said there will be budget meetings in mid-March. Finance Minister Harish Rao will hold meetings with officials of all departments on the budget from Sunday (March 6).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X