వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో మంత్రివర్గ విస్తరణ..? పనితీరు ఆధారంగా మార్పు చేర్పులు.. కవితకు ఖాయం..?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ త్వరలో జరగనుంది. మంత్రుల పనితీరు ఆధారంగా మార్పు చేర్పులు ఉండనున్నాయి. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ముగ్గురు నుంచి నలుగురు మంత్రులను తొలగించే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతే..

ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతే..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం వ్యతిరేకంగా వచ్చింది. జనవరి లేదా ఫిబ్రవరి తొలి వారంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ, మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి- హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అభ్యర్థుల విజయం బాధ్యత ఆయా జిల్లాల మంత్రులదేనని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. గెలవకపోతే పదవులు ఉండవు అని కొందరిని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ఒక సీటుకు అభ్యర్థి ఖరారు

ఒక సీటుకు అభ్యర్థి ఖరారు

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానంలో టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరు ఖరారు చేశారు. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థానానికి పార్టీ అభ్యర్థి ఎవరన్నది తేలలేదు. సీఎం హెచ్చరించడంతో ఆరు ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్తమయ్యారు. ఓటరు నమోదు కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఇతర జిల్లాల మంత్రుల పనితీరును బేరీజు వేసుకుని మంత్రివర్గంలో చేరికలు, తొలగింపులను నిర్ణయించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.

భర్తీ కానీ నామినేటెడ్ పదవులు

భర్తీ కానీ నామినేటెడ్ పదవులు

రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోన్న.. నామినేటెడ్‌ పదవులు పూర్తిగా భర్తీ కాకపోవటంపై అసంతృప్తి నెలకొంది. ఏదో ఒక కారణంతో వాయిదా పడుతుండటం నిరాశకు గురిచేస్తోంది. 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో చేపట్టిన బుజ్జగింపుల ప్రక్రియలో.. పదవులు ఇస్తామంటూ హామీలు ఇచ్చింది. పదుల సంఖ్యలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్‌ పదవులు, గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కోసం ఎదురుచూస్తున్నాయి.

Recommended Video

Dubbaka Bypoll Result : BJP’s Win In Telangana’s Dubbaka Is Historic - PM Modi | Oneindia Telugu
కవితకు బెర్త్ ఖాయం..?

కవితకు బెర్త్ ఖాయం..?

వీరితోపాటు ఇటీవలే ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన కవితకు బెర్త్ ఖాయం అని సమాచారం. మంత్రుల పనితీరు ఆధారంగా ముగ్గురు నుంచి నలుగురిని తప్పించే అవకాశాలు ఉన్నాయి. అందులో ఒక బెర్త్ కవితకు ఖరారు అయ్యిందని ప్రచారం జరుగుతోంది. మిగతా మూడు పదవులు పార్టీ కోసం పనిచేసి.. ప్రమోషన్ కోసం చూస్తున్నవారికి అప్పగించే అవకాశం ఉంది. మరో 2 నుంచి 3 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

English summary
telangana cabinet Expansion in soon sources said. kavitha will be induct to cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X