వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు...కోత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం

|
Google Oneindia TeluguNews

నాలుగు నెలల తర్వాత తెలంగాణ క్యాబినెట్ సమావేశం సుమారు ఎనిమిది గంటల పాటు కొనసాగింది. సమావేశంలో పలు కీలక విషయాలు చర్చించారు.. .కాగా క్యాబినెట్ భేటికి సంబంధిన విషయాలను సీఎం కేసీఆర్ స్వయంగా వివరించారు. ఈనేపథ్యంలోనే పోరుగు రాష్ట్ర్రాలతో సత్సంబంధాలను కొనసాగించాని, పక్కరాష్ట్రాల సంభంధాలపై క్యాబినెట్ లో విస్తృతంగా చర్చించామని చెప్పారు. ఇక ఏపితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించినట్టు ఆయన ప్రకటించారు.

పొరుగు రాష్ట్ర్రాలతో కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలు

పొరుగు రాష్ట్ర్రాలతో కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలు

తెలంగాణ రాకముందు కర్ణాటక, మహారాష్ట్ర్రతో పాటు ఏపితో కూడ నిత్యం వివాదాలు ఉండేవని. అలాంటీ పరిస్థితుల నుండి ఇప్పుడు బయటపడ్డామని చెప్పారు.ప్రస్థుతం ఆయా రాష్ట్ర్రాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయని సీఎం వెళ్లడించారు. ఇక కాంగ్రెస్ హయాంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు సైతం పూర్తి కావస్తున్నాయని సీఎం తెలిపారు. ఈనేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్ర్రంతో మూడు సార్లు నీళ్లను ఇచ్చిపుచ్చుకున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మహారాష్ట్ర్ర పూర్తిగా సహాకారం అందిస్తోందని చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు శంకు స్థాపన...

కాళేశ్వరం ప్రాజెక్టు శంకు స్థాపన...


కాళేశ్వరం ప్రాజెక్టు ద్వార 45 లక్షల ఎకరాలకు నీరందించంతోపాటు పారీశ్రామిక అవసరాలకు కూడ నీటీ అవసరాన్ని తీర్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈనేపథ్యంలోనే మహారాష్ట్ర్ర ముఖ్యమంత్రితో పాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రానున్నారని అన్నారు. ఈనేపథ్యంలోనే ఏపి ముఖ్యమంత్రి జగన్ కూడ ఏపిలోని ఉత్తరాధి ప్రాంతాలకు నీరును తీసుకువెళ్లేందుకు దృడ నిశ్చయంతో ఉన్నారని తెలిపారు. దీంతో రెండు రాష్ట్ర్రాలకు సంబంధించిన అంశాలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని అన్నారు.

5000 టీఎంసీల నీటిని తెలుగు రాష్ట్ర్రాలు ఉపయోగించుకుంటాం

5000 టీఎంసీల నీటిని తెలుగు రాష్ట్ర్రాలు ఉపయోగించుకుంటాం


క్రిష్ణ, గోదావరి నదుల్లో ఉన్న నీటీని, ఉభయ రాష్ట్ర్రాలకు అందుబాటులో ఉన్న నికర, వరద జలాలు సుమారు 5000 టీఎంసీల నీళ్లని చెప్పారు. ఇక వీటిని రెండు రాష్ట్ర్రాలు ఉపయోగించుకుని ప్రతి అంగుళం భూమికి నీరుు అందివ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఈనేపథ్యంలోనే రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో వీటిని అమలు చేసి చూపిస్తామని ప్రకటించారు. ఈనేపథ్యంలోనే రెండు రాష్ట్ర్రాల మధ్య సహయ సహాకారలు అందిపుచ్చుకోవాలని ఆయన ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.వీటికి సంబంధించి ఏవైన సమస్యలు ఉంటే రెండు రాష్ట్ర్రాల అధికారులో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

నూతన సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాల నిర్మాణం

నూతన సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాల నిర్మాణం


కాగా 400 కోట్లతో నూతన సెక్రటేరియట్ భవనాన్ని అత్యధునికంగా నిర్మిస్తామని చెప్పారు. మరోవైపు 100 కోట్లతో నూతన శాసన సభను కూడ నిర్మిస్తామని చెప్పారు. అయితే సెక్రటేరియట్‌ను పాత బిల్డింగ్‌ ప్రాంతంలోనే నిర్మించాలని నిర్ణయించారు. ఇక అసెంబ్లీ భవనాన్నిఎర్రమంజీల్‌లోని
17ఎకరాల స్థలంలో నిర్మిస్తామని చెప్పారు. కాగా జూన్ 27న నూతన సెక్రటేరియట్‌కు ప్రారంభోత్సవం చేస్తామని చెప్పారు. మంచి రోజులు లేని కారణంగా ఆరోజున ప్రారంభిస్తామని చెప్పారు. అయితే దీనిపై ఎలాంటీ విధి విధానాలు రూపోందించాలని ప్రకటించారు

ఉద్యోగులకు పదవి విరమణ వయస్సు 61 పెంపు

ఉద్యోగులకు పదవి విరమణ వయస్సు 61 పెంపు


ఉద్యోగులకు పీఆర్సీతోపాటు పదవి విరమణ వయస్సును కూడ పెంచుతామని సీఎం ప్రకటించారు. అయితే పీఆర్సీ ఎంత శాతం ఇవ్వాలనే దానిపై ఉద్యొగ సంఘాలతో సమావేశమై చర్చిస్తామని అన్నారు. ఈనేపథ్యంలోనే ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన రూ. లక్ష రుపాయల
రుణమాఫి అమలుకు అమోదం తెలుపుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఆసరా పించన్లు పెంపుకు ఆమోద్ర వేసింది.ఇక పంచాయితీ రాజ్ నూతన చట్టంతోపాటు కోత్త పురపాలక చట్టానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఇప్పటికే ఏర్పడిన ములుగు, నారయాణపేట కొత్త జిల్లాలకు జారీ చేసిన ఉత్తర్వులకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.

English summary
Four months later the Telangana Cabinet meeting held. But the conference was very important Topics discussed .. and Cabinet discussion issues briefed by CM KCR himself. The Cabinet has said that it has discussed the rapprochement with the Neighborhood state. And kcr announced that cabinet has decided to continue f
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X