వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరెస్టుపై టి జెండా: ఢిల్లీలో వేడుకలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు పర్వతంపై 21,500 అడుగుల ఎత్తులో రాష్ట్ర తొలి అవతరణ ఉత్సవాలను ఏడుగురు తెలంగాణ యువకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకం, తెలంగాణ జెండా, స్వచ్ఛ హైదరాబాద్-స్వచ్ఛ తెలంగాణ పోస్టర్, బతుకమ్మను ప్రదర్శించారు.

సాహసోపేతమైన యాత్రలో చెక్కుచెదరకుండా బతుకమ్మను అక్కడకు తీసుకెళ్ళడం గమనార్హం. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన రంగారావు, కల్పేష్ షా, కిరణ్‌కుమార్, రాజేందర్, రాఘవేంద్ర, అలీ అహ్మద్, శివకుమార్ అనే ఏడుగురు యువకులు అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తరఫున రంగారావు నేతృత్వంలో మే 17న హైదరాబాద్ నుంచి రైలు ద్వారా ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచి జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్, స్టాక్ కాంగ్రీ మీదుగా ఎవరెస్టు పర్వతానికి చేరుకున్నారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని యాత్రను దిగ్విజయంగా పూర్తిచేశామని వారు తెలిపారు. ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కుతున్న క్రమంలో 18,500 అడుగల ఎత్తులో ఒక పర్వతంపై బతుకమ్మను ప్రతిష్టించామని చెప్పారు.

ఎవరెస్టుపై టి జెండా

ఎవరెస్టుపై టి జెండా

ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు పర్వతంపై 21,500 అడుగుల ఎత్తులో రాష్ట్ర తొలి అవతరణ ఉత్సవాలను ఏడుగురు తెలంగాణ యువకులు ఘనంగా జరుపుకున్నారు.

ఎవరెస్టుపై టి జెండా

ఎవరెస్టుపై టి జెండా

ఈ సందర్భంగా జాతీయ పతాకం, తెలంగాణ జెండా, స్వచ్ఛ హైదరాబాద్-స్వచ్ఛ తెలంగాణ పోస్టర్, బతుకమ్మను ప్రదర్శించారు.

ఎవరెస్టుపై..

ఎవరెస్టుపై..

రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన రంగారావు, కల్పేష్ షా, కిరణ్‌కుమార్, రాజేందర్, రాఘవేంద్ర, అలీ అహ్మద్, శివకుమార్ అనే ఏడుగురు యువకులు అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తరఫున రంగారావు నేతృత్వంలో మే 17న హైదరాబాద్ నుంచి రైలు ద్వారా ఢిల్లీకి చేరుకున్నారు.

ఎవరెస్టుపై

ఎవరెస్టుపై

అక్కడి నుంచి జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్, స్టాక్ కాంగ్రీ మీదుగా ఎవరెస్టు పర్వతానికి చేరుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని యాత్రను దిగ్విజయంగా పూర్తిచేశామని వారు తెలిపారు.

ఢిల్లీలో వేడుకలు

ఢిల్లీలో వేడుకలు

ఈ ఏడుగురిని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో అవతరణ ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి సన్మానించారు.

ఢిల్లీలో వేడుకలు

ఢిల్లీలో వేడుకలు

ఈ సాహసయాత్రకు ప్రోత్సాహాన్ని అందించిన రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు రమణాచారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

రాజా-రాధారెడ్డి ప్రదర్శన

రాజా-రాధారెడ్డి ప్రదర్శన

ఢిల్లీలో జరిగిన తెలంగాణ ఉత్సవాల్లో అహుతులను అమితంగా ఆకర్షించిన ప్రముఖ కళాకారులు రాజా రాధారెడ్డి ప్రదర్శన.

ఢిల్లీలో వేడుకలు

ఢిల్లీలో వేడుకలు

ఢిల్లీలో జరిగిన తెలంగాణ ఉత్సవాల్లో అహుతులను అమితంగా ఆకర్షించిన ప్రముఖ కళాకారులు రాజా రాధారెడ్డి ప్రదర్శన.

ఢిల్లీలో వేడుకలు

ఢిల్లీలో వేడుకలు

ఢిల్లీలో జరిగిన తెలంగాణ ఉత్సవాల్లో అహుతులను అమితంగా ఆకర్షించిన ప్రముఖ కళాకారులు రాజా రాధారెడ్డి ప్రదర్శన.

ఢిల్లీలో వేడుకలు

ఢిల్లీలో వేడుకలు

ఢిల్లీలో జరిగిన తెలంగాణ ఉత్సవాల్లో అహుతులను అమితంగా ఆకర్షించిన ప్రముఖ కళాకారులు రాజా రాధారెడ్డి ప్రదర్శన.

జూన్ 2న మధ్యాహ్నం 12.15 గంటలకు 21,500 అడుగుల ఎత్తున ముగ్గురు సభ్యులు జాతీయ పతాకాన్ని, ఆ తర్వాత తెలంగాణ పతాకాన్ని ఎగురవేశారు. సాయంత్రం 5.15 గంటలకు అక్కడకు చేరుకున్న ముగ్గురు సభ్యుల మరో బృందం స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్ పోస్టర్‌ను ప్రదర్శించారు. యాత్రను దిగ్విజయంగా ముగించుకొని ఆదివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు.

ఎవరెస్ట్ పర్వతంపై ఇప్పటివరకు పేరుపెట్టని ఓ పర్వతానికి తెలంగాణ పీక్ (శిఖరం) అని నామకరణం చేశారు. ఏ రాష్ట్ర అవతరణ వేడుకలను ఎవరెస్ట్‌పై నిర్వహించలేదని, ఇలా నిర్వహించడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి అని బృందం సభ్యుడు రంగారావు తెలిపారు. యాత్రను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదుకు త్వరలోనే దరఖాస్తు చేస్తామన్నారు.

కాగా, ఈ ఏడుగురిని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో అవతరణ ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి సన్మానించారు. ఈ సాహసయాత్రకు ప్రోత్సాహాన్ని అందించిన రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు రమణాచారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Telangana celebrations were held on Everest mountain by Telangana Youth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X