వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెథాయ్ తుఫాను ఎఫెక్ట్: ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి పర్యటనకు ఆటంకం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాల్సి ఉంది. అయితే పెథాయ్ తుఫాను, భారీ వర్షాల కారణంగా ఈ సందర్శన కార్యక్రమం వాయిదా పడింది. తుపాను ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.

దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుందనే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత ప్రకటన చేయనున్నారు. కేసీఆర్‌ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా శనివారం రాష్ట్రంలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం నిర్వహించారు.

Telangana chief minister K Chandrasekhar Raos Kaleshwaram Project visit postponed due to heavy rains.

ఈ సమీక్షా సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన ఖరారైంది. ప్రాజెక్టుల పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదని ఓసారి తానే స్వయంగా వచ్చి పనులను పరిశీలిస్తానని కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో రేపు కాళేశ్వరానికి వెళ్లాల్సి ఉండగా తుపాను కారణంగా వాయిదా పడింది. కేసీఆర్ తొలి పర్యటనకు అడ్డంకి ఏర్పడటంతో శకునం బాగా లేదా అనే చర్చ సాగుతోంది.

English summary
Telangana chief minister K Chandrasekhar Rao's Kaleshwaram Project visit postponed due to heavy rains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X