వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనతా కర్ఫ్యూ-సెల్యూట్: చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపిన సీఎం కేసీఆర్, మంత్రులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

సీఎం కేసీఆర్ తన మనవడు, ఇతర కుటుంబసభ్యులు, మంత్రులు, అధికారులు, సిబ్బందితో కలిసి చప్పట్లు కొట్టారు. సీఎం కేసీఆర్ దంపతులతోపాటు మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఈటెల రాజేందర్, ఎంపీ సంతోష్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు.

జనతా కర్ఫ్యూలో భాగంగా మంత్రి హరీశ్ రావు కూడా కరోనాను ఎదుర్కోవడంలో ఎంతో కృషి చేస్తున్న సిబ్బందికి చప్పట్లతో సంఘీభావం తెలిపారు. తన కుటుంబసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టి.. అత్యవసర విభాగాల్లో సేవలందిస్తున్న సిబ్బందికి సంఘీభావం ప్రకటించారు. మంత్రి హరీశ్ రావుతోపాటు, పలవురు అధికారులు, పోలీసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా చప్పట్లు కొట్టి సంఘీభావం ప్రకటించారు.

Telangana CM KCR and minister salutes to emergency staff with claps

కాగా, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 'కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించేందుకు సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించే అంశంపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఐదు గంటలకు ప్రగతి భవన్లో విలేకరుల సమావేశం ఉంటుంది' అని తెలంగాణ సీఎం తన అధికారిక ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

English summary
Telangana CM KCR expressed solidarity with the fight against Coronavirus in response to the call given by PM narendramodi by clapping hands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X