వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభివృద్ది సాధించిన జడ్పీలకు 10 కోట్ల ప్రత్యేక నిధులు .. సీఎం కేసీఆర్

|
Google Oneindia TeluguNews

గ్రామాల అభివృద్దికి పాటుపడిన జిల్లా పరిషత్‌లకు పది కోట్ల రూపాయలు ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇటివల ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌లు వైస్ చైర్‌పర్సన్‌లతో సీఎం సమావేశయ్యారు. ఈనేపథ్యంలోనే కొత్తగా ఎన్నికైన సభ్యులకు దిశనిర్ధేశనం చేశారు.పంచాయితీ రాజ్ ఉద్యమ స్పూర్తితో గ్రామాల అభివృద్దికి పాటు పడాలని సీఎం సూచించారు.

ఈనేపథ్యంలోనే రాష్ట్ర్రంలో ఇప్పటికే అభివృద్ది చెందిన గంగదేవీ పల్లే, ముల్కనూరు, అంకాపూర్ వంటి ఆదర్శ గ్రామాలుగా రాష్ట్ర్రంలోని ఇతర గ్రామాలను తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సంధర్భంగానే రానున్న ఆరు నెలల్లో పల్లేలో అభివృద్ది మార్పు కనిపించాలని ఆయన అన్నారు. ఇందుకోసం ప్రజా ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Telangana CM KCR announces Rs 10 crore for the district development

కాగా గెలిచిన ప్రజా ప్రతినిధులు గెలిచిన గర్వంతో పని చేయవద్దని సూచించారు. పంచాయితీ రాజ్ చట్టంలో భాగంగా పంచాయితీ వ్యవస్థలను బలోపేతం చేయాలని చెప్పారు.ఈనేపథ్యంలోనే గ్రామీణ అభివృద్దికి పూర్వ వైభవం తీసుకురావాలని అన్నారు.ఇలా గ్రామాల్లో నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేసిన జిల్లా పరిషత్‌లకు ప్రత్యేక నిధి ద్వార రూ.10 కోట్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. ఇలా అన్ని జిల్లాలు పోటి పడి అభివృద్ది సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఇక కొత్తగా ఎన్నికైన చైర్మన్లకు కొత్త వాహానాలను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు.తెలంగాణ సాధించిని విధంగానే గ్రామాల అభివృద్ది కూడ ముందుకు తీసుకుపోవాలని వారిని కోరారు.

English summary
Telangana CM KCR announces Rs 10 crore for the district development. kcr met with newly elected jilla parishat chair persons at pragathi bavan. and he geve some directions to zp chair persons for development
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X