వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్సీ అభ్య‌ర్దిగా గుత్తా స‌ఖేంద‌ర్ రెడ్డి : ఖ‌రారు చేసిన సీఎం కేసీఆర్‌: ఎన్నిక లాంఛ‌న‌మే..!

|
Google Oneindia TeluguNews

ఎంతో కాలంగా స‌రైన ప‌ద‌వి కోసం ఎదురు చూస్తున్న న‌ల్గొండ జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యించారు. తాజాగా ఎన్నిక‌ల సంఘం తెలంగాణ‌లో ఒక స్థానం..ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసారు. తెలంగాణ‌లో ఎమ్మెల్సీగా ఉన్న యాద‌వ రెడ్డి పైన అన‌ర్హ‌త వేటు వేయ‌టంతో ఇప్పుడు ఎన్నిక అనివార్యం అయింది. ఎమ్మెల్యే కోటాలో జ‌రుగుతున్న ఎన్నిక కావ‌టంతో అసెంబ్లీలో టీఆర్‌య‌స్‌కు సంఖ్యా బ‌లం ఆధారంగా ఈ ఒక్క సీటు టీఆర్‌య‌స్‌కు ద‌క్క‌నుంది. దీంతో.. ఈ సీటును సుఖేంద‌ర్ రెడ్డికి ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన కేసీఆర్ నామినేష‌న్ల ప్ర‌క్రియ బాధ్య‌త‌ను మ‌రో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ అప్ప‌గించారు.

బీజేపీలోకి విజ‌య‌శాంతి..!!? ర‌ంగంలోకి అమిత్ షా దూత‌లు బీజేపీలోకి విజ‌య‌శాంతి..!!? ర‌ంగంలోకి అమిత్ షా దూత‌లు

ఎమ్మెల్సీగా సుఖేంద‌ర్‌రెడ్డి..

ఎమ్మెల్సీగా సుఖేంద‌ర్‌రెడ్డి..

సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్య‌ర్దిగా ఖ‌రారు చేస్తూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. జ‌న‌తాపార్టీ ద్వారా రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేసి..టీడీపీలో క్రియాశీల‌కంగా ప‌ని చేసిన గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి నాటి ముఖ్య‌మంత్రి వైయ‌స్ ఆహ్వానంతో కాంగ్రెస్‌లో చేరారు. 2009లో న‌ల్గొండ నుండి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత టీఆర్‌య‌స్‌లో చేరారు. చాలా కాలంగా టీఆర్‌య‌స్‌లో కీల‌క ప‌ద‌వి కోసం ఆయ‌న ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్ప‌టికి ఆయ‌న ఎమ్మెల్సీ ప‌దవి ఇవ్వాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు. తాజాగా ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో సుఖేంద‌ర్ రెడ్డికి తెలంఆణ రైత స‌మ‌న్వ‌య స‌మితి ఛైర్మ‌న్‌గా నామినేటెడ్ పోస్టును కేసీఆర్ అప్ప‌గించారు. ఇక‌, ఇప్పుడు తాజాగా ఎన్నిక‌ల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్ర‌కారం జ‌రుగుతున్న ఏకైక ఎమ్మెల్సీ స్థానానికి సుఖేంద‌ర్ రెడ్డి టీఆర్‌య‌స్ అభ్య‌ర్ధిగా నామినేష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. త‌న‌ను అభ్య‌ర్దిగా ఖ‌రారు చేసిన కేసీఆర్‌కు గుత్తా సీఎం క్యాంపు కార్యాల‌యంలో క‌లిసి కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

యాద‌వ‌రెడ్డి ఖాళీతో..ఎమ్మెల్సీగా అవ‌కాశం..

యాద‌వ‌రెడ్డి ఖాళీతో..ఎమ్మెల్సీగా అవ‌కాశం..

యాద‌వ‌రెడ్డి పైన అన‌ర్హ‌త వేటు కార‌ణంగా ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వి కోల్పోయారు. దీంతో.ఎన్నిక‌ల సంఘం ఈ స్థానం భ‌ర్తీ కోసం ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిన షెడ్యూల్ ప్ర‌కారం ఆగ‌స్టు 7వ తేదీన ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. అదే నెల 14వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తారు. 16న నామినేష న్ల ప‌రిశీల‌న జ‌రుగుతుంది. 19వ తేదీ నామినేష‌న్ల ఉప సంహ‌ణ‌కు తుది గ‌డువు. ఆగ‌స్టు 26న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జ‌ర‌గుతుంది. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌క‌టించిన ఖాళీల మేర‌కు తెలంగాణ‌లోని యాద‌వ‌రెడ్డికి 2021 మార్చి 3వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఉంది. ఈ స్థానంలో టీఆర్‌య‌స్ అభ్య‌ర్దిగా ఎమ్మెల్సీ అవ్వటం లాంఛ‌న‌మే. దీంతో.. ఇప్పుడు కేసీఆర్ త‌మ పార్టీ అభ్య‌ర్దిగా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిని ఖ‌రారు చేయ‌టంతో ఆయ‌న కొత్త‌గా ఎమ్మెల్సీ కానున్నా రు. ఆయ‌న ఎన్నిక ఇక లాంఛ‌నంగానే భావించాలి.

 2021 మార్చి వ‌ర‌కు ఎమ్మెల్సీ ప‌ద‌విలో..

2021 మార్చి వ‌ర‌కు ఎమ్మెల్సీ ప‌ద‌విలో..

ప్ర‌స్తుతం యాద‌వ‌రెడ్డి ఖాళీ చేసిన స్థానానికి ఎన్నిక‌ల జ‌రుగుతుండ‌టంతో..ఆ స్థానంలో ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యే వ్య‌క్తి 2021 మార్చి నెలాఖ‌రు వ‌ర‌కు ఎమ్మెల్సీగా ఉండ‌నున్నారు. ఎమ్మెల్యే కోటాలో జరుగుతున్న ఎన్నిక కావ‌టం..స‌భ‌లో ప్ర‌తిపక్షాల సంఖ్యా బ‌లం ప్ర‌స్తుతం అధికార పార్టీ కంటే చాలా తేడా ఉండ‌టంతో.. గుత్తా ఎన్నిక లాంఛ‌నం కానుంది. ఇదే స‌మ‌యంలో సుదీర్ఘ కాలం త‌రువాత ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్క‌టంతో గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఆశ‌లు ఫ‌లించాయి. నామినేష‌న్ల ప్ర‌క్రియ ఈనెల 7వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఆయ‌న మంచి ముహూర్తం చూసుకొని నామినేష‌న్ దాఖ‌లు చేస్తార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

English summary
Telangana CM KCR decided Gutta Sukhendar Reddy as TRS MLC candidate for MLA quota contest. Recently Election commission released Schedule for this election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X