వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోటి మంది మ‌హిళ‌ల‌కు చీర‌లు.. తెలంగాణ ప్రభుత్వ కానుక!

తెలంగాణ పండుగ బతుక‌మ్మ సంద‌ర్భంగా కోటికి పైగా చీర‌ల‌ను తెలంగాణ మ‌హిళ‌ల‌కు బ‌హుమానంగా ఇవ్వ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌క‌టించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ పండుగ బతుక‌మ్మ సంద‌ర్భంగా కోటికి పైగా చీర‌ల‌ను తెలంగాణ మ‌హిళ‌ల‌కు బ‌హుమానంగా ఇవ్వ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌క‌టించారు.

తెలంగాణ జీవితం, సంస్కృతిలో భాగ‌మై, కుటుంబ విలువ‌ల‌కు అద్దం పట్టే బ‌తుక‌మ్మ పండుగ సంతోషాల‌ను రెట్టింపు చేసేందుకు మ‌హిళ‌ల‌కు చీర‌లు బ‌హూక‌రించేందుకు ప్ర‌భుత్వం నిర్ణయించినట్లు సీఎం కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

Telangana CM KCR to gift free Sarees to one crore women for Bathukamma,

ఈ చీర‌ల‌ను సెప్టెంబ‌ర్ 18-20 తేదీల మ‌ధ్య రేష‌న్ షాపుల ద్వారా కుల‌, మ‌తాల‌కు అతీతంగా 1,04,57,610 మంది మ‌హిళ‌ల‌కు పంచి పెట్ట‌నున్నారు. ఇందుకోసం ఆర్థికంగా క‌ష్టాలు ప‌డుతున్న చేనేత కార్మికుల నుంచి చీర‌లు కొనుగోలు చేశామ‌ని, ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్య‌క‌ర్త‌లు త‌మ వంతు కృషి చేయాల‌ని కేసీఆర్ కోరారు.

ఈ నేప‌థ్యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో చీర‌ల నాణ్య‌త‌ను కేసీఆర్ ప‌రీక్షించి, పంచ‌డానికి ఆమోదం తెలిపారు. రంజాన్, క్రిస్‌మ‌స్ పండుగ‌ల స‌మ‌యంలో త‌మ ప్ర‌భుత్వం ఆయా మ‌తాల వారికి వ‌స్త్రాలు బ‌హూక‌రించిన విష‌యాన్ని కూడా సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

English summary
Telangana Chief Minister K. Chandrasekhar Rao on Friday announced that the state will distribute free sarees to over one crore women on the occasion of Bathukamma, a regional festival. "Bathukamma festival is an integral part of the Telangana life and culture. This festival is a symbol of family relationships. The state government has decided to distribute sarees on this occasion to enable people to celebrate the festival with more enthusiasm," a statement from the Chief Minister's Office quoted him as saying. Rao said that the government will present the gift to women irrespective of their caste, community or religion, adding that the sarees would be distributed through ration shops to 1,04,57,610 women from September 18-20.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X