హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూటు మార్చిన గులాబీ బాస్: ఆ రెండు ఓటుబ్యాంకులపై ఫోకస్: సురభి వాణీదేవికి బీఫాం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో శాసన మండలి ఎన్నికల కోలాహలం నెలకొంది. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు ఎన్నికలను నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండబోతోంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ జన సమితితో పాటు కొందరు స్వతంత్ర అభ్యర్థుల నుంచీ గట్టిపోటీని తెలంగాణ రాష్ట్ర సమితిని ఎదుర్కొనబోతోంది. తొలుత- దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనూహ్యంగా ప్రతికూల ఫలితాలను చవి చూసిన అనుభవం ఉన్నందున ఈ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

చెమటోడ్చక తప్పనట్టే..

చెమటోడ్చక తప్పనట్టే..

వరంగల్-ఖమ్మం-నల్గొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే టీఆర్ఎస్ శ్రమించక తప్పని పరిస్థిితి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున రాములు నాయక్, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీలో నిలిచారు. తాజాగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు కుమార్తె సురభి వాణిదేవిని పోటీలో దింపింది టీఆర్ఎస్. దీనికి సంబంధించిన టీఆర్ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొద్దిసేపటి కిందటే ఆమెకు బీఫామ్‌ను అందజేశారు.

ఫోటోలు: జీహెచ్‌ఎంసీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన గద్వాల విజయలక్ష్మీ

కోదండరామ్.. నాగేశ్వర్ సహా

కోదండరామ్.. నాగేశ్వర్ సహా


ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఎదురు కానుందనే అభిప్రాయాలు ఉన్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ నుంచి తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తోన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇదివరకు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వామపక్షాల మద్దతుతో విజయం సాధించారు. మరోసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ నుంచి తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్‌ పోటీ చేయనున్నారు.

మహిళకు ఛాన్స్ ఇవ్వడం వల్ల..

మహిళకు ఛాన్స్ ఇవ్వడం వల్ల..

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మహిళకు అవకాశం ఇవ్వడం వల్ల లాభిస్తుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. దానికితోడు- పీవీ నరసింహా రావు కుమార్తె కావడం వల్ల కాంగ్రెస్ ఓటుబ్యాంకుతో పాటు తటస్థులు కూడా సురభి వాణిదేవి వైపు మొగ్గు చూపుతారని భావిస్తోంది. ఇదివరకు ఎదురైన చేదు ఫలితాలు ఈ సారి పునరావృతం కానివ్వకూడదనే పట్టుదల టీఆర్ఎస్ పార్టీ క్యాడర్‌లో కనిపిస్తోంది. అందుకే- వివాదరహితులుగా పేరున్న సురభి వాణిదేవికి టీఆర్ఎస్ అవకాశం ఇచ్చిందన అభిప్రాయాలు ఉన్నాయి.

English summary
Telangana Chief Minister K Chandra Sekhar Rao handing over B form to Surabhi Vani Devi, daughter of former PM PV Narasimha Rao. Yesterday CM announced her candidature for upcoming polls to Telangana Legislative Council from Graduates' constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X