వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం తీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి.... 'జీఎస్టీ'పై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ

|
Google Oneindia TeluguNews

జీఎస్టీ పరిహారం చెల్లింపులో కేంద్రం జాప్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించిన సీఎం... వెంటనే ఈ ఆలోచన విరమించుకోవాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. కేంద్రం చర్యలు సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం(సెప్టెంబర్ 1) ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు.

Recommended Video

Telangana COVID-19 Update : 2751 New Cases Found In 24hrs, GHMC పరిధిలోనే ఎక్కువ కేసులు! || Oneindia

అవసరాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వమే రుణాలు తీసుకుని రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలని కేసీఆర్ పేర్కొన్నారు. చట్టంలో పేర్కొన్న ప్రకారం 14 శాతం వృద్ధి రేటు ఆధారంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గితే.. కేంద్రమే దాన్ని భర్తీ చేయాలని గుర్తు చేశారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం తప్పనిసరిగా చెల్లిస్తామని చట్టంలో చెప్పి... తీరా ఇప్పుడు దాన్ని ఉల్లంఘించడం సరైనదేనా అని ప్రశ్నించారు.

telangana cm kcr letter to pm narendra modi over gst compensation

జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చి జీఎస్టీ బిల్లును సమర్థించామని కేసీఆర్ పేర్కొన్నారు.జీఎస్టీపై మొట్టమొదట స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించింది తెలంగాణ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. జీఎస్టీ ఫలాలు దీర్ఘ కాలం అందుతాయని... తద్వారా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు పెరుగుతాయని ఆశించినట్లు చెప్పారు.

అప్పట్లో యూపీఏ సర్కార్ సీఎస్టీని రద్దు చేసినప్పుడు పూర్తి పరిహారాన్ని అందజేస్తామని హామీ ఇచ్చిందని... కానీ రాష్ట్రాలు దాన్ని తిరస్కరించాయని కేసీఆర్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల ఒత్తిడి మేరకు రెవెన్యూ నష్టాన్ని పూడ్చేందుకు ప్రతీ 2 నెలలకొకసారి పూర్తి జీఎస్టీ పరిహారం చెల్లించేలా చట్టంలో నిబంధన ఉందన్నారు. అయినప్పటికీ జీఎస్టీ చెల్లింపుల్లో జాప్యం జరుగుతూనే ఉందని.. ఏప్రిల్ నుంచి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందలేదని అన్నారు.

కరోనా పరిస్థితుల కారణంగా ఏప్రిల్,2020లో తెలంగాణ ప్రభుత్వం 83 శాతం రెవెన్యూను న‌ష్ట‌పోయిందన్నారు.అదే స‌మ‌యంలో కరోనా కట్టడికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చిందని... రాష్ట్రాల అవ‌స‌రాలు, పేమేంట్ల భారం కూడా పెరిగిపోయిందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ,విత్త విధానం కేంద్రం చేతిలో ఉన్నందునా రాష్ట్రాలకు వేరే ఆప్షన్ లేక విధిగా కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితులు తలెత్తాయన్నారు.

English summary
On Tuesday, Telangana CM K Chandrasekhar Rao demanded Prime Minister Narendra Modi to reverse the decision of asking states to meet the shortfall in GST compensation through borrowings. Maintaining that it was imperative to strengthen cooperative federalism in this crisis situation,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X