వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరూ హుషారయ్యారు: హరీష్, కెటిఆర్‌పై కెసిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం కెసిఆర్ బుదవారం నాడు మంత్రులు కెటిఆర్, హరీష్‌రావుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ హుషారయ్యారని కొత్త జిల్లాల కలెక్టరేట్ల శంకుస్థాపన కార్యక్రమంలో అన్నారు.జిల్లా అడగడంతోపాటు పలు డిమాండ

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ల భవనాల శంకుస్థాపన కార్యక్రమాల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రులు హరీష్‌రావు, కెటిఆర్‌లపై ప్రశంసలు కురిపించారు.ఇద్దరూ కూడ హుషారయ్యారని కెసిఆర్ రెండు సభల్లో నవ్వులు పూయించారు.

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ల భవన శంకుస్థాప కార్యక్రమానికి కెసిఆర్ బుదవారం నాడు శ్రీకారం చుట్టారు.
సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి సీఎం కెసిఆర్ శంకుస్థాపన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బుదవారం సాయంత్రం సిరిసిల్లలో జరిగిన శంకుస్థాపనలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం కెసిఆర్.

Telangana CM KCR makes funny comments on KTR and Harish Rao

సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ భవనానికి శంకుస్థాపన చేసిన తర్వాత బహిరంగసభలో సీఎం కెసిఆర్ మాట్లాడారు.సిద్దిపేట జిల్లా ఇస్తే సరిపోతోందని హరీష్‌ చెప్పాడని సీఎం గుర్తుచేశారు.ఈ మధ్య హరీష్‌రావు హుషారయ్యాడని చెప్పారు. మెడికల్ కాలేజీ అడిగాడని, దాన్ని మంజూరు చేసినట్టు కెసిఆర్ చెప్పారు. వచ్చే ఏడాది కల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం నిర్మాణం పూర్తికానున్నాయని కెసిఆర్ చెప్పారు.

సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ భవనానికి శంకుస్థాపన జరిగిన తర్వాత జరిగిన సభలో మంత్రి కెటిఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. తన ప్రసంగంలో సిరిసిల్ల జిల్లాకు కావాల్సిన నిధులను కెటిఆర్ అడిగారు.అంతేకాదు ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలు కెసిఆర్‌కు తెలుసునని చెప్పారు. వేములవాడ రాజన్న గుడిలోనే కెసిఆర్ వివాహం అయిన విషయాన్ని కెటిఆర్ గుర్తు చేశారు.

అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ తన సహజశైలిలోనే ప్రసంగిస్తూ కెటిఆర్ ప్రసంగంపై చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. సిరిసిల్ల జిల్లా ఇస్తే సరిపోతోందని తొలుత చెప్పాడని కెటిఆర్ గతంలో తనతో అన్న మాటలను కెసిఆర్ గుర్తుచేశారు. ఇప్పుడేమో డిమాండ్లు ముందుపెట్టి మూడు, నాలుగొందలకు ఎసరుపెట్టాడన్నారు. అంతేకాదు వేములవాడ రాజన్న గుడిలోనే తన పెళ్ళి అయిన విషయాన్ని ఆయన కెటిఆర్ గుర్తుచేశారని కెసిఆర్ ప్రస్తావించారు.కెటిఆర్‌కు సిరిసిల్ల నీళ్ళు పడ్డాయని కెసిఆర్ అనగానే సభికులు పెద్ద పెట్టున నవ్వారు.

English summary
CM KCR has inaugurated the Collectorate buildings in Siddipet and Siricilla constituencies and during these occasions, KCR heaped indirect praises on Ministers KTR and Harish Rao. KCR said KTR has become active these days
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X