వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా సీఎం కేసీఆర్ కొత్త సంవత్సరం కొత్త సంకల్పం ... 2020లో ఆయన నినాదం ఇదే

|
Google Oneindia TeluguNews

Recommended Video

#happynewyear2020 : CM KCR New Year Resoulution In 2020 !

2020 వచ్చేసింది. కొత్త జోష్ తెచ్చేసింది . కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఈ కొత్త సంవత్సరంలో చేయాల్సిన పనుల గురించి న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకుంటారు. అయితే ఈసారి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సంవత్సరం సందర్భంగా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇక తన నిర్ణయం గురించి చెప్పి రాష్ట్రంలో ప్రతీ ఒక్కరు అలా చేస్తే బాగుంటుంది అని ఆయన సూచించారు.

2020లో సీఎం కేసీఆర్ కొత్త రిజల్యూషన్

2020లో సీఎం కేసీఆర్ కొత్త రిజల్యూషన్

ఇంతకీ తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి ? 2020లో సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారు అంటే..2020 సంవత్సరంలోకి అడుగుపెట్టిన అందరికీ, అందరూ బాగుండాలంటూ శుభాకాంక్షలు చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన శుభాకాంక్షలతో పాటుగా తన సంకల్పంలో రాష్ట్ర ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. ఇంతకీ కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకున్నారంటే తెలంగాణలో 100% అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నినాదాన్ని తీసుకున్నానని చెప్పారు.

ఈచ్ వన్ - టీచ్ వన్ నినాదంతో సీఎం కేసీఆర్ సంకల్పం

ఈచ్ వన్ - టీచ్ వన్ నినాదంతో సీఎం కేసీఆర్ సంకల్పం

ఇక అంతే కాదు కొత్త సంవత్సరంలో ఈచ్ వన్- టీచ్ వన్ అంటూ తాను తీసుకున్న కొత్త నినాదాన్ని, సరికొత్త సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ అమలు చేస్తే బాగుంటుంది అని ఆయన సలహా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పౌరులంతా కనీసం ఒక్కరికైనా విద్య నేర్పించాలనే సంకల్పంతో ముందుకు వెళ్లాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇక దీని కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కోరిన కేసీఆర్ అలా చేసినట్లయితే ఒక్క ఏడాదిలోనే తెలంగాణ రాష్ట్రం 100% అక్షరాస్యత రాష్ట్రంగా ఆవిర్భవిస్తుందని ఆయన తెలిపారు.

తెలంగాణా రాష్ట్రంలో 100శాతం అక్షరాస్యత చూడాలనే నిర్ణయం

తెలంగాణా రాష్ట్రంలో 100శాతం అక్షరాస్యత చూడాలనే నిర్ణయం

తెలంగాణా రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా చూడాలని సంకల్పించిన ఆయన అందుకోసం రాష్ట్ర ప్రజల సహకారం కావాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాష్ట్రం ఆవిర్భవించిన అయిదున్నర సంవత్సరాలలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచిందని, బంగారు తెలంగాణ దిశగా పైన సాగిస్తుందని అందుకు తాను గర్విస్తున్నానని పేర్కొన్నారు.

విజయాలు సాధించిన స్పూర్తితో రాష్ట్ర ప్రజలు ముందుకు సాగాలని సూచన

విజయాలు సాధించిన స్పూర్తితో రాష్ట్ర ప్రజలు ముందుకు సాగాలని సూచన


సాధించిన విజయాలిచ్చిన స్ఫూర్తితో కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. ఈచ్ వన్ - టీచ్ వన్ నినాదంతో ప్రజలంతా సంకల్ప సాధనకు క‌ృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ తీసుకున్న న్యూ ఇయర్ రిజల్యూషన్ పాటిస్తే నిజంగానే తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా నిలవడం ఖాయం .

English summary
CM KCR advised that everyone should implement the new slogan that he has taken in the new year Each one - Teach One. Tell the citizens of Telangana state that one person should teach one person at least to go ahead, CM KCR suggested. He urged everyone to pledge to do so, he said, if Telangana state becomes 100% literate within a year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X