విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడ దుర్గమ్మకు తీర్చే మొక్కు ఇదే: కొండపై 'కేసీఆర్' నినాదాలు, వద్దన్న సెక్యూరిటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

కేసీఆర్ బెజవాడ దుర్గమ్మకు బంగారు ముక్కు పుడక సమర్పణ

విజయవాడ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గన్నవరం చేరుకుంటారు. ఎయిర్ పోర్టులో ఏపీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వర రావులు స్వాగతం పలుకుతారు.

కేసీఆర్ ఎయిర్ పోర్ట్ నుంచి వెటర్నరీ కళాశాల అతిథి గృహంకు చేరుకుంటారు. ఆ తర్వాత దుర్గమ్మ తల్లిని దర్శించుకునేందుకు బయలుదేరుతారు. అక్కడ అమ్మ వారికి ముక్కుపుడక సమర్పించుకుంటారు. కేసీఆర్ రాక కోసం విజయవాడలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Telangana CM KCR to offer nose stud to Kanaka Durga temple in Vijayawada

గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద కేసీఆర్ కాన్వాయ్ కోసం 15 వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ తర్వాత ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి హైదరాబాద్ పయనం అవుతారు.

కాగా, ఆయన రావడానికి ముందే కేసీఆర్ జిందాబాద్ అంటూ ఇంద్రకీలాద్రిపై అభిమానులు నినాదాలు చేశారు. టీఆర్ఎస్ జెండా, ఫ్లెక్సీలతో కొండపైకి వచ్చారు. అయితే కొండపై రాజకీయ నినాదాలు చేయవద్దని భద్రతా సిబ్బంది వారించింది. ఫ్లెక్సీలు తొలగించాలని దుర్గగుడి భద్రతా సిబ్బంది సూచించింది.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao has stoked controversy again as he is all set to make an offering of a nose stud to the presiding diety at the Kanaka Durga Goddess temple in Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X