వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాసాలమర్రి గ్రామ సర్పంచ్ కి సీఎం కేసీఆర్ ఫోన్ .. 22 న పర్యటన, వారితో కలిసి భోజనం

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈనెల 22వ తేదీన యాదాద్రిలో పర్యటించనున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఈ క్రమంలోనే యాదాద్రికి వెళ్లనున్నారు. యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ ఆ గ్రామ సర్పంచ్ కు ఫోన్ చేసి మాట్లాడారు. 2020 నవంబర్‌లో సిఎం ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ సర్పంచ్ అంజయ్య తో తాను పర్యటనకు వస్తున్నానని అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని మాట్లాడారు.

గ్రామంలో సామూహిక భోజనాలు చేసిన అనంతరం గ్రామ సభను ఏర్పాటు చేసి సమస్యలపై చర్చిద్దామని చెప్పిన కేసీఆర్ తన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను చూడాలని మాట్లాడారు. కులం ,మతం ,వర్గం,పార్టీలకు అతీతంగా అందరితో కలిసి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలని, గ్రామస్తులు అందరితో కలిసి భోజనం చేస్తా అని పేర్కొన్నారు. గ్రామసభను నిర్వహించడానికి మరియు జిల్లా కలెక్టర్ మరియు స్థానిక అధికారుల సహాయంతో తనకు భోజనం ఏర్పాటు చేయడానికి గ్రామంలో రెండు వేదికలను ఎన్నుకోవాలని సిఎం అంజయ్యను కోరారు. గ్రామసభ సమావేశం కోసం రెయిన్ ప్రూఫ్ టెంట్ ఏర్పాటు చెయ్యాలని కెసిఆర్ సర్పంచ్ తో అన్నారు.

Telangana CM KCR phone to Vasalamarri village sarpanch

ఇప్పటికే యాదాద్రి జిల్లా కలెక్టర్ గ్రామంలో సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.అధికారుల పనితీరును పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకోగా, వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న కేసీఆర్ దత్తత గ్రామం లో 22వ తేదీన పర్యటించనున్నారు. ఇక సర్పంచ్ గా అందర్నీ కలుపుకుపోవాలని, ఇతర పార్టీ నాయకులను కూడా కలుపుకొని పనిచేయాలని సీఎం కేసీఆర్ కు అంజయ్య సూచించారు. తన పర్యటన నేపథ్యంలోనే వాసాలమర్రి గ్రామ సర్పంచ్ అంజయ్యకు ఫోన్ చేసి మాట్లాడారు.

English summary
Chief Minister K Chandra Sekhar Rao will visit Vasalamarri village in Turkapalli Mandal of Yadadri Bhuvanagiri district on June 22. In November 2020, the CM adopted the village and assured to develop it on all fronts. KCR spoke to sarpanch Anjaiah over phone on Friday and informed him that he will visit his village on June 22.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X