వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హ‌రీష్ స్ట్రోక్ త‌గిలింది: న‌లుగురితో కేసీఆర్‌ కేబినెట్ విస్త‌ర‌ణ‌..మ‌హిళ‌కు అవ‌కాశం: 6న ముహూర్తం..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

CM KCR Planning To Expand His Cabinet On August 6th | న‌లుగురితో ఆగ‌స్టు 6న KCR కేబినెట్ విస్త‌రణ!!

తెలంగాణ‌లో రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన స‌మ‌యం నుండి హ‌రీష్ పైనే అంద‌రి దృష్టి. కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత ఆయ‌న కుమారుడు కేటీఆర్‌ను టీఆర్‌య‌స్ వ‌ర్కింగ్ ప్రెడిసెంట్‌ను చేసారు. అప్ప‌టి నుండి అంటే దాదాపు ఎనిమిది నెల‌ల కాలం పార్టీ ట్రబుల్ షూట‌ర్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌టం పైనా పార్టీలోనే కాదు సాధార‌ణ ప్రజానీకంలోనూ పెద్ద ఎత్తున చ‌ర్చ సాగింది. దీంతో..ఇక ఆల‌స్యం చేయ‌కుందా హ‌రీష్‌ను కేబినెట్‌లోకి తీసుకోవ‌టంతో పాటుగా గ‌త అయిదేళ్ల కాలం..ఇప్పుడూ మ‌హిళ‌కు కేబినెట్‌లో స్థానం లేద‌నే విమ‌ర్శ‌కు స‌మాధానంగా మ‌హిళ‌కు త‌న కేబినెట్‌లో స్థానం క‌ల్పించాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు. మొత్తంగా న‌లుగురితో ఆగ‌స్టు 6న కేసీఆర్ తన కేబినెట్ విస్త‌ర ణ‌కు మూహ‌ర్తం ఖ‌రారు చేసారు.

హ‌రీస్‌..కేటీఆర్‌ల‌కు మంత్రివ‌ర్గంలో స్థానం..

హ‌రీస్‌..కేటీఆర్‌ల‌కు మంత్రివ‌ర్గంలో స్థానం..

ఎనిమిది నెల‌ల క్రితం రెండో సారి తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి పీఠం ద‌క్కించుకున్న కేసీఆర్‌..తొలి కేబినెట్ విస్త‌ర‌ణ‌కు స‌మ‌యం తీసుకున్నారు. అనూహ్యంగా అందులో కేటీఆర్‌..హ‌రీష్‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌లేదు. కేటీఆర్‌కు పార్టీలో కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌టంతో ఎవ‌రూ పెద్ద‌గా ఆక్షేపించ‌లేదు. కానీ, హ‌రీష్‌ను కేబినెట్‌లో తీసుకోక‌పోవ‌టం పైన మాత్రం విమ‌ర్శలు వ‌చ్చాయి. దీంతో..ఇక హ‌రీష్‌ను మ‌రింత కాలం ప్రాధాన్య‌త ఇవ్వ‌టం లేద‌నే సంకేతాలు ఇస్తే పార్టీకే న‌ష్ట‌మ‌ని గ్ర‌హించి న కేసీఆర్‌..ఇప్పుడు కేబినెట్‌లో హ‌రీష్‌తో పాటుగా త‌న‌యుడు కేటీఆర్‌ను సైతం తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు. కేసీఆర్ కేబినెట్‌లో ప్ర‌స్తుతం 12మంది మంత్రులు ఉన్నారు. మ‌రో ఆరుగురిని తీసుకొనే వెసులుబాటు ఉంది. కానీ, ఈ ద‌ఫాలో కేవ‌లం న‌లుగురిని మాత్ర‌మే తీసుకోవాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అందులో హ‌రీష్‌.. కేటీఆర్ ల స్థానం దాదాపు ఖ‌రారైంది. హ‌రీష్‌కు అసెంబ్లీ వ్య‌వ‌హారాలు..ఇరిగేష‌న్ తిరిగి అప్ప‌గించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇక‌, ఇప్ప‌టికైనా హ‌రీష్‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నందుకు ఆయ‌న అభిమానుల్లో సంతోషం వ్య‌క్తం అవుతోంది.

తొలి మ‌హిళా మంత్రిగా స‌బిత‌..తుమ్మ‌లకు ఛాన్స్..

తొలి మ‌హిళా మంత్రిగా స‌బిత‌..తుమ్మ‌లకు ఛాన్స్..

రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత కేసీఆర్ తొలి ప్ర‌భుత్వంలో మ‌హిళా మంత్రి లేకుండానే తొలి ట‌ర్మ్ పూర్తి చేసారు. దీని పైన అనేక విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. రెండో ద‌ఫా అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా కేసీఆర్ త‌న కేబినెట్ లో మ‌హిళా మంత్రిగా అవ‌కాశం ఇవ్వ‌లేదు. అయితే, కాంగ్రెస్ నుండి మ‌హేశ్వ‌రం ఎమ్మెల్యేగా గెలిచి..టీఆర్‌య‌స్‌లో చేరిన స‌బితా ఇంద్రారెడ్డికి ఇచ్చిన హామీ మేర‌కు కేబినెట్‌లోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.ఆ త‌రువాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల్లో స‌బితా అధికారికంగానే టీఆర్‌య‌స్ ఎమ్మెల్యే అయ్యారు. వైయ‌స్సార్ ప్ర‌భుత్వంలో హోం మంత్రిగా ప‌ని చేసిన స‌బిత అంత‌కు ముందు ఆయ‌న కేబినెట్‌లోనే గ‌నుల శాఖా మంత్రిగానూ వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఖ‌మ్మం జిల్లా నుండి తుమ్మ‌ల‌కు మ‌రో సారి అవ‌కాశం ద‌క్క‌నుంది. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు టిక్కెట్‌ కేటాయించినప్పుడే తుమ్మలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని సీఎం హమీ ఇచ్చినట్లు సమాచారం.

ఆగ‌స్టు 6న ముహూర్తం ఖ‌రారు..

ఆగ‌స్టు 6న ముహూర్తం ఖ‌రారు..

న‌లుగురు మంత్రుల‌తో కేబినెట్ విస్త‌ర‌ణ‌కు కేసీఆర్ ముమూర్తం సైతం ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆగ‌స్టు రెండో తేదీ నుండి శ్రావ‌ణ మాసం ఆరంభం కానుంది. అందులో భాగంగా ఆగ‌స్టు 6వ తేదీన విస్త‌ర‌ణ‌కు ముహూర్తం ఖ‌రారు చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అదే రోజున న‌లుగురు మంత్రుల‌తో కేసీఆర్ త‌న కేబినెట్‌ను విస్త‌రించ‌నున్నారు. మ‌రో ఇద్ద‌రికి అవ‌కాశం ఉన్నా..మున్సిప‌ల్ ఎన్నిక‌ల పైన దృష్టి పెట్టిన కేసీఆర్ ఆ ఎన్నిక‌ల త‌రువాత ఇద్ద‌రిని త‌న కేబినెట్‌లోకి తీసుకొనే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఆ స‌మ‌యంలో గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డితో పాటుగా మాజీ మంత్రి ల‌క్ష్మా రెడ్డి పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి. ఆగ‌స్టు 15 త‌రువాత పాల‌న అంటే ఏంటో..ఎలా ప‌రుగులు తీయిస్తానో చూడండి అంటూ ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో..అంత‌కంటే ముందుగానే ఒక మ‌హిళతో పాటుగా మ‌రో ముగ్గురికి అవ‌కాశం ఇస్తూ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.

English summary
Telangana CM KCR Planning to expand his cabinet on August 6th with four members. Harish , KTR, Tummala and first time lady minister in his cabinet with Sabitha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X