వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెల్‌కమ్ వ్యూహం: వైఎస్ అప్పుడలా, కెసిఆర్ ధీమా అదేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సీఎం కెసిఆర్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.టిడిపితో పొత్తు పెట్టుకొంటే 2019 ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడకేననే అభిప్రాయంతో కెసిఆర్ ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనుసరించిన వ్యూహన్ని కెసిఆర్ అనుసరించే అవకాశాలున్నాయి.

చంద్రబాబుపై తిరుగుబాటు: అప్పుడు నాగం, ఇప్పుడు రేవంత్చంద్రబాబుపై తిరుగుబాటు: అప్పుడు నాగం, ఇప్పుడు రేవంత్

Recommended Video

డామిట్ కథ అడ్డం తిరిగింది: కేసీఆర్‌కు ఊహించని దెబ్బ ? KCR trolled for targeting Reddy community

2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం సాధించామని టిఆర్ఎస్ ప్రచారం చేసింది. తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఒప్పించలేకపోయింది. దీనికితోడు కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సమన్వయలోపం కూడ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణంగా మారింది.

రాహూల్‌తో రేవంత్ భేటీ, నవంబర్ 9న, కాంగ్రెస్‌లోకి?రాహూల్‌తో రేవంత్ భేటీ, నవంబర్ 9న, కాంగ్రెస్‌లోకి?

అయితే తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. 12 మంది టిడిపి ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టిఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కూడ లేకపోలేదు.

రేవంత్‌కు షాక్: టిడిపికి 12 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు, కెసిఆర్ వ్యూహమిదే!రేవంత్‌కు షాక్: టిడిపికి 12 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు, కెసిఆర్ వ్యూహమిదే!

తెలంగాణలో 2019 ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టేందుకు కెసిఆర్ వ్యూహత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవలంభించిన వ్యూహన్ని కెసిఆర్ అనుసరించే అవకాశాలు కన్పిస్తున్నాయి.

వైఎస్ఆర్ వ్యూహన్ని అనుసరించనున్న కెసిఆర్

వైఎస్ఆర్ వ్యూహన్ని అనుసరించనున్న కెసిఆర్

2009 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టిడిపి, టిఆర్ఎస్,. వామపక్షాలు మహకూటమిగా ఏర్పడి పోటీచేశాయి. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకొనే టిఆర్ఎస్, భాషాప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని కోరుకొనే సిపిఎంలు కూడ ఇదే కూటమిలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఈ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడ్డాయి. 2004 ఎన్నికల్లో టిడిపికి వ్యతిరేకంగా కాంగ్రెస్, టిఆర్ఎస్, ఉభయకమ్యూనిష్టుపార్టీలు పోటీచేశాయి.. ఆ సమయంలో టిడిపిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.2009 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ అనుసరించిన వ్యూహన్ని కెసిఆర్ 2019 ఎన్నికల్లో అనుసరించనున్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు నల్గొండ, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్ లాంటి జిల్లాల్లోని సెటిలర్ల ఓటు బ్యాంకు లక్ష్యంగా కెసిఆర్ వ్యూహరచన చేస్తున్నారు.

2014 ఎన్నికల్లో జిహెచ్ ఎం సి ఎన్నికల్లో టిడిపి, బిజెపి హవా

2014 ఎన్నికల్లో జిహెచ్ ఎం సి ఎన్నికల్లో టిడిపి, బిజెపి హవా

జిహెచ్ఎంసి పరిధిలో 24 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి బిజెపి కూటమి హవా కొనసాగింది.టిఆర్ఎస్ కేవలం మూడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.8 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి, 5 స్థానాల్లో బిజెపి విజయం సాధించింది.8 అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించింది. పొత్తుల కారణంగా కొన్ని గెలిచే సీట్లను బిజెపికి ఆ సమయంలో టిడిపి కేటాయించిన కారణంగా కొన్ని సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఏడాది క్రితం జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అయితే 2019 ఎన్నికల నాటికి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కెసిఆర్ వ్యూహం రచిస్తున్నారు. టిడిపితో కెసిఆర్ మైత్రిని కోరుకొంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

2019 ఎన్నికలకు కెసిఆర్ ప్లాన్ ఇదే

2019 ఎన్నికలకు కెసిఆర్ ప్లాన్ ఇదే

2019 ఎన్నికల్లో విజయం సాధించేందుకు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో జిహెచ్ఎంసి పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలని టిఆర్ఎస్ వ్యూహంగా కన్పిస్తోంది. టిడిపితో పొత్తు పెట్టుకొంటే జిహెచ్ఎంసి పరిధిలోని 24 సీట్లు కైవసం చేసుకొనే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్ లాంటి జిల్లాల్లో సెటిలర్ల ఓటు బ్యాంక్ తమకు కలిసివచ్చే అవకాశం ఉందని టిఆర్ఎస్ అభిప్రాయంతో ఉంది.టిడిపితో పొత్తును కెసిఆర్ ప్రతిపాదించారనే ప్రచారం సాగుతోంది.

 వైఎస్ ప్లాన్ సక్సెస్ ఇలా..

వైఎస్ ప్లాన్ సక్సెస్ ఇలా..

2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉమ్మడి ఏపీకి అప్పటికే ఐదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ఆర్ అనుసరించిన వ్యూహం 2009లో కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేలా చేసింది. ఏ పార్టీతో పొత్తు లేకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు వైఎస్.మహకూటమిని ఏర్పాటుచేసినా టిడిపి 2009 ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. 2009 ఎన్నికల సమయంలో తొలివిడతలో తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. అయితే తొలివిడత పోలింగ్ ముగిసేందుకు 2 గంటలుండగానే కర్నూల్ జిల్లా నంద్యాలలో వైఎస్ఆర్ చేసిన ప్రసంగం టిడిపిని రాజకీయంగా ఇబ్బందుల్లో పెట్టింది. హైద్రాబాద్‌కు వెళ్ళాలంటే పాస్‌పార్ట్ తీసుకోని వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొన్నాయంటూ వైఎస్ఆర్ నంద్యాల వేదికగా ప్రచారం చేశారు.ఈ ప్రచారం రెండో విడత పోలింగ్‌లో కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. జిహెచ్ఎంసి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

English summary
Telangana cm Kcr planning to implement Ysr formula in 2019 elections. Kcr ready to alliance with Tdp in 2019 elections. Tdp senior leader Mothkupally Narsimhulu said that Tdp alliance with Trs in 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X