వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరంగల్లోనే, కన్నీళ్లొచ్చాయ్: కేసీఆర్, కెకెతో ఘర్షణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

వరంగల్: ఎవరికీ లొంగని, ఏ విషయంలోను రాజీపడని వ్యక్తులు వరంగల్ జిల్లాలో ఎక్కువగా ఉంటారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. వరంగల్ నిట్ ఆడిటోరియంలో కాళోజీ సంస్మరణ సభ జరిగింది. కాళోజీ చిత్రపటానికి కేసీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కాళోజీ చిత్రపటాన్ని గీసిన మనోహర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.

కాళోజీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నారు. కాళోజీ కేవలం వరంగల్‌కో, తెలంగాణకో, భారత్‌కో చెందిన వ్యక్తి కాదన్నారు. ఆయన ప్రపంచానికి చెందిన వ్యక్తి అన్నారు. కాళోజీ విశ్వకవి, విశ్వమానవుడు అన్నారు. ఆయన గురించి ఎంత పొగుడుకున్నా తక్కువే అన్నారు. ఎవరికీ లొంగని, ఏ విషయంలోను రాజీపడని వ్యక్తులు వరంగల్ జిల్లాలో ఎక్కువగా ఉంటారని అన్నారు. కాళోజీ ఏ విషయంలోను ఎప్పుడు రాజీపడలేదన్నారు.

పరాయి పాలనలో మనం చాలా బాధలు పడ్డామని, కాళోజీ గురించి కూడా చెప్పుకునే లేకుండెనన్నారు. హైదరాబాదులోని రవీంద్ర భారతిని తలదన్నేలా వరంగల్ జిల్లాలో కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం రూ.12 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. కాళోజీ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. కాళోజీ సహచర్యంతో ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. కాళోజీ ఫౌండేషన్‌కు రూ.10 లక్షలు ఇస్తామన్నారు.

Telangana CM KCR praises Warangal people

తెలంగాణ వచ్చినందుకు ఈ రోజు జయశంకర్, కాళోజీలు జీవించి ఉంటే ఎంతో సంతోషించే వారన్నారు. ఆంధ్రా వారు తమ పొట్టి వారిని పొడుగువారిగా చూపించారన్నారు. మన దాశరథిని, పాల్కురికి సోమనాథుని, కాళోజీ వంటి వారిని ఆంధ్రా పాలకులు పట్టించుకోలేదన్నారు. కాళోజీ ఏదైనా ఉంటే ముఖం మీదనే చెప్పేవారన్నారు. తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి రోజును ప్రకటిస్తామన్నారు. కాళోజీ పేరిట ఓ విశ్వవిద్యాలయం ముందు ముందు పెడతామన్నారు.

కేకేకు, నాకు మధ్య పంచాయతీ

కేకేకు నాకు మధ్య ఉదయం పంచాయతీ జరిగిందన్నారు. పంచాయతీ అంటే నిజమైన పంచాయతీ కాదని, వాదన అన్నారు. ఓ ఇనిస్టిట్యూట్‌కు వందల ఎకరాలు, ఆసుపత్రికి కూడా వందల ఎకరాల భూమి ఉంటుందని, వంరగల్ కలెక్టరేట్‌కు 25 ఎకరాలు ఉందని, ఇంత అవసరమా అని కేసీఆర్ ప్రశ్నించారు.

ఫుట్‌పాత్ పైన రోజుకు నాలుగు లక్షల మంది పడుకుంటారని విని తాను, కన్నీళ్లు పెట్టుకున్నానని, ఇలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రినా అని ఆవేదన చెందానన్నారు. పేదలకు 50 గజాల ఇళ్లు సమకూర్చని ప్రభుత్వాలు ఎందుకన్నారు.

ఇప్పటి వరకు ఏం చేయలేదు

ఇప్పటి వరకు తాము ఏమీ చేయలేదని, ఇక ముందు చేసి చూపిస్తామని కేసీఆర్ అన్నారు. తమ వంద రోజుల పాలన పైన పొన్నాల నిత్యం విమర్శలు గుప్పించడం విడ్డూరమన్నారు. భూమిలేని దళితులకు భూమి ఇస్తామని, లక్ష కుటుంబాలకు ఇవ్వాలన్నారు. మనం కూడా ఇప్పుడే పొగడుకోవడం కాదని, లక్ష కుటుంబాలకు భూమి ఇచ్చాక పొగుడుకుందామన్నారు. చేయని దానిని చేసినట్లు, చిన్న దానిని పెద్దగా చెప్పడం తనకు ఇష్టముండదన్నారు.

చేస్తేనే చెబుతానని అన్నారు. తన కేబినెట్లోని మంత్రులు కూడా అలాగే ఉండాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజయ్యకు హితవు పలికారు. ఉద్యమంలో ఎలా చిచ్చర పిడుగులా పని చేశామో.. తెలంగాణ పునర్నిర్మాణంలోను అలాగే పని చేస్తామన్నారు. తాను ఇతర పార్టీలలో అబద్దాలు ఆడనని చెప్పారు. తాను ఎన్నికల ప్రచారం సమయంలో విద్యుత్ సమస్య గురించి ముందే చెప్పానని, మూడేళ్ల తర్వాత విద్యుత్ ఇరవై నాలుగు గంటలు ఇస్తామన్నారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao has praised Warangal people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X