వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సీఎం కేసీఆర్ పీఆర్వో రాజీనామా: వ్యక్తిగత కారణాలంటూ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వద్ద ప్రజా సంబంధాల అధికారిగా పనిచేస్తోన్న గటిక విజయ్ కుమార్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన కొద్దిసేపటి కిందటే వెల్లడించారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే తాను ముఖ్యమంత్రి పీఆర్వో హోదా నుంచి తప్పుకోవాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ట్రాన్స్‌కోలో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేస్తోన్నారాయన. డెప్యుటేషన్‌పై ముఖ్యమంత్రి వద్ద పీఆర్వోగా విధుల్లో ఉంటోన్నారు.

Recommended Video

Telangana MLC Elections : CM KCR Key Decision On Telangana MLC Election

ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలను స్వీకరించిన తొలి రోజుల నుంచే విజయ్ కుమార్.. ఆయన వద్ద పని చేస్తోన్నారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా, విశ్వాసపాత్రుడిగా విజయ్ కుమార్‌కు పేరుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఉద్యమంలో ఆయన చురుగ్గా వ్యవహరించారు. వేర్వేరు జేఏసీల్లో కీలక పాత్ర పోషించారు. విజయ్ కుమార్ స్వస్థలం నెక్కొండ. ప్రాథమికోన్నత విద్యాభ్యాసాన్ని అక్కడే పూర్తి చేశారు. అనంతరం వరంగల్‌‌లోని ఎల్బీ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు.

Telangana CM KCR PRO G Vijay Kumar resigned

ఇదివరకు కేసీఆర్ సాధించిన విజయాలు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన పోరాటాన్ని పొందుపరుస్తూ ఓ పుస్తకాన్ని కూడా రాశారాయన. కాగా ఆయన హఠాత్తుగా ఎందుకు రాజీనామా చేశారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వ్యక్తిగత కారణాలేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయాలు, ముఖ్యమంత్రి కార్యాలయం, పేషీపై గట్టి పట్టు ఉన్న ఆయన ట్రాన్స్‌కో జనరల్ మేనేజర్‌గా కూడా రాజీనామా చేయడం రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

English summary
Gatika Vijay Kumar, Public Relation Officer of Telangana Chief Minister K Chandra Sekhar Rao, resigned for his post as well as General Manager of Telangana State Transmission Corporation also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X