• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

షాక్: సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ -ఫామ్‌హౌజ్‌లో ఐసోలేషన్ -సాగర్ సభ కొంపముంచిందా?

|

తెలంగాణలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతున్నది. మ్యూటేషన్లు, డబుల్ మ్యూటేషన్లు, విదర్భ వేరియంట్ల వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా మారిందని, ఇంట్లో ఒక్కరికి వైరస్ సోకినా, కుటుంబం మొత్తానికీ అంటుకుంటుందని వైద్య శాఖ డైరెక్టర్ హెచ్చరిస్తున్నారు. ఇంతలోనే వైరస్ వ్యాప్తి తీవ్రతకు నిదర్శనమన్నట్లుగా ముఖ్యమంత్రి సైతం కొవిడ్ కాటుకు గురయ్యారు..

వ్యాక్సిన్ల కొరత: నిద్ర లేచిన కేంద్రం -సీరం సంస్థకు రూ.3వేల కోట్లు, భారత్ బయోటెక్‌కు రూ.1500కోట్లు అప్పు, కానీవ్యాక్సిన్ల కొరత: నిద్ర లేచిన కేంద్రం -సీరం సంస్థకు రూ.3వేల కోట్లు, భారత్ బయోటెక్‌కు రూ.1500కోట్లు అప్పు, కానీ

సీఎం కేసీఆర్‌కు కరోనా

సీఎం కేసీఆర్‌కు కరోనా

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(67)కు కరోనా వైరస్ సోకింది. కొవిడ్ వ్యాధికి సంబంధించిన స్వల్ప లక్షణాలతో ఆయన కొద్ది రోజులుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. ముఖ్యమంత్రికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడం, ఐసోలేషన్ లో చికిత్స పొందుతుండటం నిజమేనని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ధృవీకరించారు.

 ప్రత్యేక వైద్యుల బృందం..

ప్రత్యేక వైద్యుల బృందం..

కరోనా కాటుకు గురై, స్వల్ప లక్షణాలు తలెత్తినప్పటి నుంచే సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌజ్ కు పరిమితం అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిపుణులైన వైద్యుల బృందం పర్యవేక్షిస్తున్నదని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది.

 సాగర్ సభలో అంటుకుందా?

సాగర్ సభలో అంటుకుందా?

సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో టీఆర్ఎస్ శ్రేణులు సహా రాష్ట్ర ప్రజలు ఒకింత ఆందోళనలకు గురయ్యారు. ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కాగా, కరోనా విలయం మొదలైనప్పటి నుంచి, ఏ మూఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. కనీసం వ్యాక్సిన్ డోసు కూడా అవసరంలేనంత ఆరోగ్యంగా ఆయన మనగలిగారు. అలాంటిదిప్పుడు సీఎం పాజిటివ్ గా తేలారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇటీవల సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభలో పాల్గొనడం తెలిసిందే. బహుశా ఆ సభలోనే ముఖ్యమంత్రి ఇన్ఫెక్ట్ అయి ఉండొచ్చనే భావన వ్యక్తమవుతోంది.

  YS Sharmila Arrest షర్మిల దీక్ష భగ్నం.. పాదయాత్ర చేస్తుండగా స్పృహతప్పి YS Jagan రంగంలోకి దిగుతారా ?

  కామసూత్ర, కొరియర్ బాయ్ -జగన్ బాబాయిపై రఘురామ సంచలనం -నర్సాపురంలో ఉపఎన్నిక, షాక్కామసూత్ర, కొరియర్ బాయ్ -జగన్ బాబాయిపై రఘురామ సంచలనం -నర్సాపురంలో ఉపఎన్నిక, షాక్

  English summary
  The Telangana Chief Minister K Chandrasekhar Rao tests positive for the COVID-19 on Monday. The Telangana Government chief secretary Somesh Kumar informed that he has mild symptoms. "He has been advised isolation and is staying at his farmhouse. A team of doctors is monitoring his health," said Somesh Kumar.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X