వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి నుంచి కేసీఆర్‌కు అరుదైన ఆహ్వానం: ఢిల్లీకి ప్రయాణం: ట్రంప్‌తో కలిసి డిన్నర్..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరి కొన్ని గంటల్లో దేశ రాజధానికి బయలుదేరనున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి తనకు అందిన అరుదైన ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీకి ప్రయాణం కట్టనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొనబోతున్నారాయన. దీనికోసం ఈ మధ్యాహ్నం కేసీఆర్ బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

కేసీఆర్‌తో కలుపుకొని వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం ఎనిమిది మంది ముఖ్యమంత్రులకు మాత్రమే ఈ విందులో పాల్గొనడానికి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు బీఎస్ యడియూరప్ప (కర్ణాటక), ఉద్ధవ్ థాకరే (మహారాష్ట్ర), నితీష్ కుమార్ (బిహార్), ఎడప్పాడి పళనిస్వామి (తమిళనాడు), మనోహర్ లాల్ ఖట్టర్ (హర్యానా), శర్బానంద సోనోవాల్ (అస్సాం)లకు మాత్రమే రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎంపిక చేసిన కేంద్ర మంత్రులకు మాత్రమే ఈ పిలుపు అందింది.

Recommended Video

Namaste Trump : On Day 2 Modi and Trump Get Down To Business | Oneindia Telugu
Telangana CM KCR to Attend Dinner in Honour of Donald Trump at Rashtrapati Bhavan

తమ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ట్రంప్‌తో చర్చిస్తారు. పెట్టుబడిదారులకు ఇస్తోన్నరాయితీలు, భూముల కేటాయింపు, తాము అనుసరిస్తోన్న పారిశ్రామిక విధానాల గురించి ఆయనకు వివరిస్తారు. ఈ విందు ముగిసిన తరువాత ట్రంప్ అమెరికా బయలుదేరి వెళ్తారు. రాష్ట్రపతి భవన్‌లో విందు ముగిసిన తరువాత నేరుగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్తారు.

English summary
Chief Minister K Chandrashekhar Rao has received an invitation from President Ramnath Kovind to attend a dinner at his residence in Delhi on February 25. The President offers dinner to the US President Donald Trump, who will be on a two-day visit to India on February 24 and 25. According to the information, Chief Minister KCR is one among a few chief ministers, who were invited by the President for the highly important dinner. The CMO has received the invitation from the President’s Office in Delhi. KCR will be leaving for Delhi on February 25 afternoon to attend the dinner to be held in the evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X