కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాగునీటి వ్యవస్థలో భారీ మార్పులు.. సీఎం కేసీఆర్ కాళేశ్వరం సందర్శన.. అధికారులకు క్లాస్

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో సాగునీటి ఇంజనీరింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అనుకున్న లక్ష్యాలు సాధించేలా ఇరిగేషన్ శాఖలోని ఇంజనీరింగ్ విభాగాలన్నింటినీ పునర్ వ్యవస్థీకరించి, ఒకే గొడుకు కిందికి తీసుకొస్తామని, రాష్ట్రాన్ని మొత్తం 11 సర్కిల్స్‌గా విభజించి, ఒక్కో సర్కిల్ కు అధిపతిగా చీఫ్ ఇంజనీర్‌ స్థాయి అధికారిని నియమిస్తామని చెప్పారు. గురువారం ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన తర్వాత కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రాజెక్టుల నిర్వహణ, నీటి సరఫరాపై ఆయన రివ్యూ నిర్వహించారు.

నాలుగు నెలల్లో ఖాళీ భర్తీ..

నాలుగు నెలల్లో ఖాళీ భర్తీ..

ఇరిగేషన్ శాఖను కూడా సీఎం కేసీఆరే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శాఖలోని అన్ని ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను జూన్ నెలాఖరులోగా భర్తీ చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఏప్రిల్ చివరికల్లా కాళేశ్వరం ప్రాజెక్టుల్లో పనిచేస్తోన్న అధికారులు, సిబ్బంది ఉండటానికి క్వార్టర్స్ నిర్మాణాలు పూర్తికావాలని, మొత్తం 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తి పోసేందుకు ప్రతి ఒక్కరూ రెడీగా ఉండాలని సూచించారు.

Recommended Video

Good Morning India: 3 Minutes 10 Headlines : YS Jagan To Meet Amit Shah Today

కొత్త కలెక్టరేట్ల నిర్మాణానికి ఆదేశం..

కరీంనగర్‌ కలెక్టరేట్ లో రివ్యూ నిర్వహిస్తూ.. అక్కడి సౌకర్యాలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కరీంనగర్ తోపాటు నిజామాబాద్ జిల్లాల్లో వెంటనే కొత్త కలెక్టరేట్ల నిర్మాణాలు చేపట్టాలని, ఆ మేరకు తక్షణమే ఆదేశాలు జారీచేయాలని సీఎస్ సోమేశ్‌కుమారుకు సూచించారు. రివ్యూ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తోపాటు ఇరిగేషన్ శాఖకు చెందిన ముఖ్య అధికారులు, కలెక్టర్లు హాజరయ్యారు. అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం.. అక్కడి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అధికారులకు సీఎం క్లాస్..


ఆయా జిల్లాల్లో కలెక్టరర్లు, ఇతర అధికారులు తమ సొంత ఇమేజ్ పెంచుకోవడానికి ప్రయత్నించొద్దంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకిల్ పై వెళ్లడం, పల్లెనిద్రలు చేయడం లాంటి పనులేవీ అవసరం లేదని, ప్రతి ఒక్కరూ హుందాగా, దర్జాగా నడుచుకోవాలని క్లాస్ తీసుకున్నారు. రెండ్రోజుల కిందట హైదరాబాద్ లో జరిగిన కలెక్టర్ల సమావేశంలోనూ సీఎం ఇదే తరహా సూచనలు చేసిన సంగతి తెలిసిందే. కలెక్టర్లు, జిల్లాల్లోని ఇతర అధికారులు ప్రభుత్వం నిర్దేశించిన పనులు మాత్రమే చేయాలని, వ్యక్తిగత ఆలోచనల్ని పక్కనపెట్టాలని సీఎం అన్నారు.

English summary
Telangana CM KCR Visits Kaleshwaram Project and offered prayers at Kaleshwaram Temple on thursday, later cm review irrigation sector at karimnagar collectorate where several ministers and officials attended
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X