వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5 వేల కోట్ల నష్టం, తక్షణమే రూ. 1350 కోట్లివ్వండి: ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టం జరిగిందని.. కేంద్ర ప్రభుత్వం వెంటనే సాయం అందించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం లేఖ రాశారు. పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయని తెలిపారు.

కరోనా మరోసారి కన్నెర్ర చేయనుందా..?ఎయిమ్స్ వైద్యులు చెప్తోందే నిజమా..?వర్షా కాలం వైరస్ విజృంభిస్తుందాకరోనా మరోసారి కన్నెర్ర చేయనుందా..?ఎయిమ్స్ వైద్యులు చెప్తోందే నిజమా..?వర్షా కాలం వైరస్ విజృంభిస్తుందా

భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర రూ. 5వేల కోట్లకుపైగా నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తక్షణ సాయంగా పునరావాస చర్యల కోసం రూ. 1350 కోట్లు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కోరారు. కాగా, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల సీఎంలను ఆరా తీసిన విషయం తెలిసిందే.

 Telangana CM KCR Wrote Letter to PM Narendra Modi On Flood Effect

సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్రం సాయం ఉంటుందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వర్ష ప్రభావిత ప్రజలను కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. బుధవారం గవర్నర్ తమిళిసై.. సీఎం కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ ఆపత్కాలంలో జాతి మొత్తం తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు.

కాగా, హైదరాబాద్ తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్తితులపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్‌లో అత్యవసర ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు తీసుకున్న సహాయక చర్యలపై ఆరా తీసిన సీఎం కేసీఆర్.. చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు.

శబరిమల సందర్శన: తెలంగాణ సీఎస్‌కు కేరళ సీఎస్ లేఖ

రాష్ట్రంలోని అయ్యప్ప భక్తుల సమాచారం కోసం శబరిమలలో అయ్యప్పస్వామి దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుపుతూ కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ సీఎస్‌కు లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో ఈసారి శబరిమల ఆలయంలో నెయ్యి అభిషేకం, పంపానదిలో స్నానాలకు అనుమతి లేదని కేరళ ప్రభుత్వం తెలిపారు. వర్చువల్ క్యూపోర్టల్ ద్వారా దర్శనం కోసం భక్తుల నమోదు తప్పనిసరి అని పేర్కొన్నారు. https://sabarimalaonline.org వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

English summary
Telangana CM KCR Wrote Letter to PM Narendra Modi On Flood Effect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X