మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ డబ్బు ఎక్కడితో చెప్పు: కేసీఆర్ చండీయాగం ఖర్చుపై దిగ్విజయ్ సింగ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ఆయుత చండీయాగంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్‌లో తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కోట్లు ఖర్చు పెట్టి యాగాలు ఎందుకు చేస్తున్నారంటూ దిగ్విజయ్‌ సింగ్‌ ప్రశ్నించారు.

telangana-cm-spends-crores-on-maha-yagam-says-not-a-penny-taken-from-state-exchequer

చండీయాగానికి తన సొంత సొమ్ము వాడుతున్నానని కేసీఆర్ ప్రకటించారని, అయితే ఆ ఎక్కడిదో చెప్పాలని ట్విట్టర్‌లో కాంగ్రెస్‌నేత దిగ్విజయ్‌సింగ్‌ డిమాండ్ చేశారు. అన్ని కోట్ల రూపాయలు తనకు ఎలా సమకూరాయన్న విషయాన్ని కేసీఆర్ ప్రజలకు వెల్లడించాలన్నారు.

ప్రజాధనం దుర్వినియోగం చేయడం కేసీఆర్‌కు సమంజసం కాదని ఆయన హితవు పలికారు. మరో ట్వీట్‌లో కేసీఆర్ నిర్వహిస్తున్న ఆయత చండీయాగాని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా హాజరవుతున్నారనే వార్తలు వస్తున్నాయని, రాష్ట్రపతి నిజంగానే హాజరవుతున్నారా? అంటూ సందేహం వ్యక్తం చేశారు.

మోడీ పాలనలో దాడులు పెరిగాయి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో క్రైస్తవులకు రక్షణ లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి విమర్శించారు. బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని మోడీ పాలనలో మైనార్టీలపై దాడులు పెరిగాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవులకు చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు.

English summary
Even as thousands of people are reeling under drought in Telangana, Chief Minister K Chandrasekhar Rao is organising a Ayutha Maha Chandi Yagam on a scale that is unprecedented. The ritual is reportedly being organised at a whopping Rs 7 crore at the Chief Minister's farmhouse in Erravelli village in Medak district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X