వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీఎస్టీ పరిధిలోకి: పెట్రోల్, డీజిల్ ధరలపై తెలంగాణ కాంగ్రెస్ భారీ ఆఫర్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత్ బంద్‌లో ప్రజలు స్వచ్చంధంగా పాల్గొన్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని మండిపడ్డారు.

కేంద్రం ధరలు పెంచుతూ ఉంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెరాస ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. వారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రంతో పోటీ పడి మరీ ఇక్కడ కేసీఆర్ ధరలు పెంచారని ఉత్తమ్ విమర్శించారు. రాష్ట్రంలో పెట్రోల్ పైన 35 శాతం, డీజిల్ పైన 27 శాతం పన్నులు విధిస్తున్నారన్నారు.

చంద్రబాబు ఓకే చెప్పారు!: ఉత్తమ్‌కు ఎల్ రమణ ఫోన్, ఆ విషయంలో 'ఏపీ సీఎం' చేతులెత్తేశారా?చంద్రబాబు ఓకే చెప్పారు!: ఉత్తమ్‌కు ఎల్ రమణ ఫోన్, ఆ విషయంలో 'ఏపీ సీఎం' చేతులెత్తేశారా?

 Telangana Congress leaders demand Petrol into GST

కేంద్రం పెట్రో ధరలను జీఎస్టీలోకి ఎందుకు చేర్చలేదని జానారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెట్రో ధరలను జీఎస్టీలోకి తీసుకు వస్తామన్నారు. రేపటి (మంగళవారం) నుంచి ఈ నెల 18వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ ఉంటుందని తెలిపారు.

పొత్తులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎన్నికల వేడి నేపథ్యంలో తెలంగాణలో పొత్తులపై కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. అతి త్వరలో పొత్తులపై రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతామని తెలిపారు. ఇవాళ కూడా పలు పార్టీలతో చర్చించామన్నారు. 12న ఆజాద్ సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరుతారన్నారు. తనను తెరాస నేత దానం నాగేందర్ కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు.

English summary
Telangana Congress leaders demand Petrol and disel into GST.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X