వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌ది రాజ్యాంగ ఉల్లంఘన: ఓటుకు నోటుపై రాష్ట్రపతికి టి కాంగ్రెస్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. శాసన సభాపతికి పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, గవర్నర్‌ ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని పేర్కొన్నారు.

రాజ్యాంగాధిపతిగా వీటిలో జోక్యం చేసుకొని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. సోమవారం రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు.

భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారన్నారు. ఇతర పార్టీలకు చెందిన 13 మంది ఎమ్మెల్యేలను, 15 మంది ఎమ్మెల్సీలను తెరాసలో చేర్చుకున్నారని చెప్పారు. టిడిపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఏకంగా మంత్రి పదవే ఇచ్చారని తెలిపారు.

సీఎం చర్యలతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని అన్నారు. ఫిరాయింపులపై ఆధారాలతో తాము సభాపతికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. గవర్నర్‌ సైతం ప్రభుత్వాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఆడియో ఆధారాలతో వెల్లడైందని, ఇద్దరు తెదేపా ఎమ్మెల్యేలు అరెస్టయ్యారని ఎంపీ వీహెచ్‌ రాష్ట్రపతికి తెలిపారు. ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మీరు ప్రస్తావిస్తున్న అంశాలపై మాట్లాడాలని తాను మనసులో భావిస్తున్నా, ఇప్పుడేమీ బదులివ్వలేకపోతున్నానని రాష్ట్రపతి ప్రణబ్‌ కాంగ్రెస్‌ నేతలతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

రాష్ట్రపతిని కలిసిన టి కాంగ్రెస్ నేతలు

రాష్ట్రపతిని కలిసిన టి కాంగ్రెస్ నేతలు

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు.

రాష్ట్రపతిని కలిసిన టి కాంగ్రెస్ నేతలు

రాష్ట్రపతిని కలిసిన టి కాంగ్రెస్ నేతలు

శాసన సభాపతికి పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, గవర్నర్‌ ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రపతిని కలిసిన టి కాంగ్రెస్ నేతలు

రాష్ట్రపతిని కలిసిన టి కాంగ్రెస్ నేతలు

రాజ్యాంగాధిపతిగా వీటిలో జోక్యం చేసుకొని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు.

రాష్ట్రపతిని కలిసిన టి కాంగ్రెస్ నేతలు

రాష్ట్రపతిని కలిసిన టి కాంగ్రెస్ నేతలు

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. సోమవారం రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు.

రాష్ట్రపతిని కలిసిన టి కాంగ్రెస్ నేతలు

రాష్ట్రపతిని కలిసిన టి కాంగ్రెస్ నేతలు

భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారన్నారు.

రాష్ట్రపతిని కలిసిన టి కాంగ్రెస్ నేతలు

రాష్ట్రపతిని కలిసిన టి కాంగ్రెస్ నేతలు

ఇతర పార్టీలకు చెందిన 13 మంది ఎమ్మెల్యేలను, 15 మంది ఎమ్మెల్సీలను తెరాసలో చేర్చుకున్నారని చెప్పారు. టిడిపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఏకంగా మంత్రి పదవే ఇచ్చారని తెలిపారు.

రాష్ట్రపతిని కలిసిన టి కాంగ్రెస్ నేతలు

రాష్ట్రపతిని కలిసిన టి కాంగ్రెస్ నేతలు

సీఎం చర్యలతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని అన్నారు. ఫిరాయింపులపై ఆధారాలతో తాము సభాపతికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. గవర్నర్‌ సైతం ప్రభుత్వాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రపతిని కలిసిన టి కాంగ్రెస్ నేతలు

రాష్ట్రపతిని కలిసిన టి కాంగ్రెస్ నేతలు

టిఆర్ఎస్ ఏడాది పాలనలో 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, నిరుడు పంటల సాగు 50 శాతం తగ్గిందని వారు వివరించారు.

రాష్ట్రపతిని కలిసిన టి కాంగ్రెస్ నేతలు

రాష్ట్రపతిని కలిసిన టి కాంగ్రెస్ నేతలు

రుణమాఫీని మొక్కుబడిగా అమలు చేశారని, ప్రభుత్వ నిర్వాకంతో రైతులు కష్టాలు పడుతున్నారని విమర్శించారు. రైతు సంక్షేమ చర్యల కోసం ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు.

రాష్ట్రపతిని కలిసిన టి కాంగ్రెస్ నేతలు

రాష్ట్రపతిని కలిసిన టి కాంగ్రెస్ నేతలు

ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఆడియో ఆధారాలతో వెల్లడైందని, ఇద్దరు తెదేపా ఎమ్మెల్యేలు అరెస్టయ్యారని ఎంపీ వీహెచ్‌ రాష్ట్రపతికి తెలిపారు.

English summary
Telangana Congress leaders Uttam Kumar Reddy, Mallu Bhatti Vikramarka, Jana Reddy on Monday met President Pranab Mukherjee in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X