వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ఖతం... మమ్మల్నీ టీఆర్ఎస్‌లో విలీనం చేయండీ...స్పికర్‌కు లేఖ ఇచ్చిన ఎమ్మెల్యేలు

|
Google Oneindia TeluguNews

ఇటివల కాంగ్రెస్ పార్టీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుని అత్యత్సహాంతో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అనుహ్యమైన షాక్ ఇచ్చేందుకు అధికార టీఆర్ఎస్ సిద్దమైంది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు నల్గోండ నుండి ఎంపీ గెలవడంతో తన హుజురునగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేశారు. ఈనేపథ్యంలోనే టీఆర్ఎస్‌లో పార్టీ పావులు కదుపుతోంది.ఇప్పటికే టీఆర్ఎస్ చేరిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో విలీన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీంతో టీఆర్ఎస్‌లో చేరిన పార్టీ ఎమ్మెల్యే స్పికర్‌కు లేఖ ఇచ్చారు.

12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిక

12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిక

టీఆర్ఎస్ పార్టీ అదను చూసి కాంగ్రెస్ పార్టీపై పంజా విసురుతోంది. ఇప్పటికే శాసన మండలీలో కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రకు ఫుల్‌స్టాప్ పెట్టిన టీఆర్ఎస్ తాజాగా అసెంబ్లీలో కూడ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రతిపక్ష హోదా కూడ దక్కకుండా స్కెచ్ వేసింది.ఇందుకోసం ఆపార్టీ విలీనానికి రంగం చేసింది. ఈనేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో సంతకాలు తీసుకున్నారు. కాగా మొత్తం ఎమ్మెల్యేలు మినిస్టర్ క్వార్టర్‌లో ఉన్న స్పికర్‌కు అందజేశారు. లేఖలో మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న 19 మందిలో 12 మంది లేఖలో సంతకాలు పెట్టారు.

స్పికర్‌కు లేఖ ఇచ్చిన అనంతరం తాము ఎలాంటీ ఒత్తిడి లేకుండా టీఆర్ఎస్‌లో చేరామని చెప్పారు.

టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు మంత్రిపదవులు

టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు మంత్రిపదవులు

అనంతరం స్సికర్ ఇంటి నుండి నేరుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. దీంతో వారికి సంబంధించిన భవిష్యత్ వ్యవహారాలపై కేటిఆర్ చర్చించారు. కాగా వీరిలో సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉండడంతోపాటు పార్టీలో చేరిన పలువురు ఎమ్మెల్యేలకు కూడ పదవులు ఇచ్చే అవకాశం ఉంది.ఇక కాంగ్రెస్ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిగిలి ఉన్నారు వారిలో

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్క,తోపాటు పోదేం వీరయ్య, భట్టి విక్రమార్క ,కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఉన్నారు.

టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాబితా..

టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాబితా..

ఇక ఇప్పటి వరకు చేరిన ఎమ్మెల్యేలు ఖమ్మం జిల్లాకు చెందిన పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు ,పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి ,కొత్తగూడేం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, ఆసీఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నల్గోండ జిల్లా నకిరేకల్ నుండి చిరుమర్తి లింగయ్య ,మహెశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ,, ఎల్బీనగర్ నుండి సుధీర్ రెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి జాజుల సురేందర్ , కోల్లాపూర్ నుండి హర్షవర్థన్ రెడ్డి, తాజాగా మాజీ మంత్రి మహెందర్ రెడ్డిపై గెలిచిన తాండుర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలు ఉన్నారు. వీరితో మొత్తం టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 12 చేరింది. ఇక గెలిచిన మొత్తం పందోమ్మిది మందిలో పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేశారు.

స్పికర్ నిర్ణయమే తరువాయి.

స్పికర్ నిర్ణయమే తరువాయి.

అనంతరం ఈ అంశంపై త్వరలో స్పికర్ నిర్ణయం తీసుకోనున్నారు. కాగ అసెంబ్లీలో ఉన్న ఎదైన పార్టీ ఎమ్మెల్యేలు మూడింట రెండు వంతుల ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో చేరి విలీనానికి అంగీకరిస్తే వారి నిర్ణయం మేరకు స్పికర్ నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటీ సంఘటనలు ఘతంలో కూడ జరిగాయి. ఇక స్పికర్ నిర్ణయం తీసుకున్న అనంతరం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి కనీస ప్రతిపక్ష హోద రద్దవుతుంది. ప్రస్థుతం ఉన్న సంఖ్య ప్రకారం ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్‌కు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

English summary
telangana congress legislature party going to merge in trs. in this series mla's who joined the trs have given letter to the assembly speaker pocharam srinivas reddy for party merge
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X