వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ - జెడీయ‌స్ కూటమిని ప్రభుత్వ ఏర్పా టుకు ఆహ్వానించాలి: రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్ల పాత్ర పై చర్చ జరగాల్సిన అవసరం ఉందని కాంగ్రేస్ నాయ‌కుడు రేవంత్ రెడ్డి అన్నారు. సంపూర్ణ మెజార్టీ రానప్పుడు గవర్నర్లు తీసుకున్న నిర్ణయాలను సమీక్షించాలని, గోవా లో అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకుండా బిజెపి కి అవకాశం ఇచ్చిన సంద‌ర్బాన్ని ఆయ‌న గుర్తు చేసారు. మణిపూర్, మేఘాలయ ల్లో ఎన్నికల తర్వాత ఏర్పాటైన కూటములకు గవర్నర్లు అవకాశం ఇవ్వలేదా అని ప్ర‌శ్నించారు.

సర్కారియా కమిషన్ సిఫార్సుల ప్రకారం ప్ర‌భుత్వాల ఏర్పాటు కోసం గ‌వ‌ర్న‌ర్ త‌సుకోవాల్సిన నిర్ణ‌యాల‌ను రేవంత్ వివ‌రించారు. 1.పూర్తి మెజార్టీ, 2.ఎన్నికల ముందు ఏర్పాటైన కూటమి మెజార్టీ సాధిస్తే, 3. ఎన్నికల తరువాత కూటమి ఏర్పాటైన తర్వాత మెజార్టీ... 4. సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం ఆన‌వాయితీ అని తెలిపారు.

telangana congress party leader revanthreddy demands Karnataka governor to give a chance for congress party

భారత రాజ్యాంగం పైన మోడీ, అమిత్ షా లకు నమ్మకం ఉంటే ప్ర‌జాస్వామ్య‌బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రించాల‌ని హిత‌వు ప‌లికారు. క‌ర్ణాట‌క‌లో ఫిరాయింపులను పరోక్షంగా గవర్నర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ, తక్షణం కాంగ్రెస్ - జెడీయ‌స్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల‌ని డిమాండ్ చేసారు. ఒక్క ఓటుతో వాజపాయి ప్రభుత్వం అదికారం కోల్పోయిందని. మ‌ళ్లీ అదికారం చేజిక్కించుకొనే అవకాశం ఉన్నా అద్వానీ, వాజపాయి లు అక్రమ మార్గాల వైపు చూడలేదని గుర్తుచేసారు. జేడీఎస్ కు మద్దతిచ్చిన కేసీఆర్, జేడీఎస్ ఏ పార్టీతో క‌లిసి ప్ర‌బుత్వం ఏర్పాటు చేయాలో చెప్పాల‌ని అన్నారు.

English summary
telangana congress party leader revanthreddy demands Karnataka governor to give a chance for congress party to farm government in karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X