వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణాలను పణంగా పెట్టి .. వరదలో కొట్టుకుపోతున్న కుక్కను కాపాడిన తెలంగాణ పోలీస్

|
Google Oneindia TeluguNews

ఒక తెలంగాణ పోలీస్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఒక కుక్క ప్రాణాన్ని కాపాడాడు. వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న కుక్కని కాపాడి అందరితో శభాష్ అనిపించుకున్నాడు. నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఒక హోం గార్డ్ వరద ప్రవాహంలో చిక్కుకున్న కుక్కని కాపాడడానికి రంగంలోకి దిగారు. తన ప్రాణాలను పణంగా పెట్టి, కొట్టుకుపోతున్న కుక్కను కాపాడాడు. అతని చర్యను అందరూ మెచ్చుకుంటున్నారు.

నాగర్ కర్నూలు పట్టణ శివార్లలో కుక్క వరద ప్రవాహంలో పడి కొట్టుకు పోతోంది. వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న కుక్క ఒక చెట్టు కొమ్మను పట్టుకుని తన ప్రాణాల కోసం విలవిలలాడుతోంది. కాపాడే వారి కోసం దీనంగా చూస్తుంది. కుక్క వరద ప్రవాహం లో చిక్కుకుని ప్రాణం కోసం అల్లాడుతున్న వైనాన్ని అక్కడ ఉండి చూస్తున్న జనంలో నుంచి హోంగార్డ్ ముజీబ్ దానిని రక్షించడం కోసం రంగంలోకి దిగాడు. రకరకాలుగా దాన్ని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు.

Telangana cop rescued a dog that was fell into a stream in the flood

చివరకు జెసిబి ని పిలిపించి, ఆ జెసిబి బకెట్ పై వెళ్లిన ముజీబ్ నిదానంగా వరదనీటిలో కిందికి దిగి కుక్క వద్దకు చేరుకున్నాడు. అసలే భయంలో ఉన్న కుక్క ఆ టెన్షన్ లో కరిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఎలాంటి భయం లేకుండా కుక్కను జెసిబి బకెట్ లోకి ఎక్కించి, తాను కూడా కుక్కతో పాటు జేసీబీ ద్వారా పైకి చేరుకున్నాడు. కుక్క ప్రాణాల కోసం రిస్కు చేసిన తెలంగాణ పోలీస్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. అతని వీరోచిత చర్యను ప్రశంసిస్తున్నారు. మనుషుల ప్రాణాలనే పట్టించుకోని వారు ఉన్న నేటి రోజుల్లో కుక్క ప్రాణాల కోసం మానవత్వాన్ని చూపించిన ముజీబ్ నిజంగా ప్రశంసనీయుడు .

Recommended Video

#Watch:వైట్‌హౌస్ వద్ద కలకలం..గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు.. ప్రెస్‌మీట్ నుంచి పరుగు తీసిన ట్రంప్!

English summary
A home guard from the Nagarkurnool police station risked his life to save a dog from a stream on 16 September. Mujeeb was applauded for his heroic act. a dog slipped and fell into a stream . home guard mujeeb risked the dog with the help of JCB .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X