తెలంగాణలో కౌంటింగ్ ఏర్పాట్లు.. లెక్కింపు కేంద్రాలు ఇవే
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 11న మంగళవారం విడుదల కానున్నాయి. దీనికోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 31 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాలు :
1) కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని 2 నియోజకవర్గాలకు సంబంధించి "సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ ఆసిఫాబాద్" లో ఓట్ల లెక్కింపు
జరగనుంది.
2) మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ "ఏఎంసి గోదాం, మంచిర్యాల" లో జరగనుంది.
3) ఆదిలాబాద్ జిల్లాలోని 2 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ "టెక్నికల్ ట్రైనింగ్ డెవలప్‌మెంట్ సెంటర్, ఆదిలాబాద్" లో జరగనుంది.
4) నిర్మల్ జిల్లాలోని 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు "పాలిటెక్నిక్ కాలేజీ, నిర్మల్
" కేంద్రంలో నిర్వహించనున్నారు.
5) నిజామాబాద్ జిల్లాలోని 6 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ "గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ, నిజామాబాద్" లో జరగనుంది.
6) కామారెడ్డి జిల్లాలోని 3 నియోజవర్గాలకు సంబంధించిన ఓట్ లెక్కింపు "ఏఎంసి గోదాం, కామారెడ్డి" లో నిర్వహించనున్నారు.
7) జగిత్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ "వీఆర్‌కే ఎడ్యుకేషన్ సొసైటీ, జగిత్యాల" లో జరగనుంది.
8) పెద్దపల్లి జిల్లాలోని 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ "JNTUH,మంథని
" లో నిర్వహించనున్నారు.
9) కరీంనగర్ జిల్లాలోని 4 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ "ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కాలేజీ, కరీంనగర్" లో జరగనుంది.
10) రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 2 నియోజకవర్గాలకు గాను ఫలితాల కౌంటింగ్ "సోషల్ వెల్ఫేర్ స్కూల్, తంగళ్ళపల్లి, సిరిసిల్ల" లో జరగనుంది.
11) సంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాల కౌంటింగ్ "గీతం యూనివర్సిటీ, సంగారెడ్డి" లో జరగనుంది.
12) మెదక్ జిల్లాలోని 2 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు "వైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మెదక్" ప్రాంగణంలో జరగనుంది.
13) సిద్దిపేట జిల్లాలోని 4 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ "ఇందూరు ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సిద్దిపేట" లో నిర్వహించనున్నారు.
14)
రంగారెడ్డి
జిల్లాలోని
4
నియోజకవర్గాలకు
సంబంధించి
ఒక
చోట,
మరో
4
నియోజకవర్గాలకు
సంబంధించిన
పోలింగ్
మరో
చోట్
నిర్వహించనున్నారు.
ఇబ్రహీంపట్నం,
ఎల్బీనగర్,
మహేశ్వరం,
షాద్
నగర్
ఈ
4
నియోజకవర్గాలకు
గాను
"బీసీ
రెసిడెన్షియల్
స్కూల్,
పాలమాకుల"
లో
కౌంటింగ్
జరగనుంది.
రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, కల్వకుర్తి ఈ 4 నియోజకవర్గాల కౌంటింగ్ "ట్రైబల్ వెల్ఫైర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ, పాలమాకుల" లో జరగనుంది.
15) వికారాబాద్ జిల్లాలోని 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు "అగ్రికల్చర్ మార్కెట్ గోదాం, వికారాబాద్" లో నిర్వహించనున్నారు.
16) మేడ్చల్ జిల్లాలోని 5 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ "హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజీ, కీసర" లో జరగనుంది.
17) హైదరాబాద్ జిల్లా పరిధిలోని (15) నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో కింది విధంగా కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
- ముషీరాబాద్, నాంపల్లి నియోజకవర్గాల కౌంటింగ్ - ఎల్బీ స్టేడియం
- మలక్ పేట సెగ్మెంట్ - జీహెచ్ఎంసీ గ్రౌండ్స్, అంబర్ పేట
- అంబర్ పేట సెగ్మెంట్ - రెడ్డి కాలేజీ, నారాయణగూడ
- ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ - కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, యూసుఫ్ గూడ
- సనత్ నగర్ సెగ్మెంట్ - ఓయూ కామర్స్ బిల్డింగ్
- తార్నాక, కార్వాన్ - ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మాసబ్ ట్యాంక్
- గోశామహాల్ నియోజకవర్గం - కోఠి ఉమెన్స్ కాలేజీ ఆడిటోరియం, కోఠి
- చార్మినార్ - కమలా నెహ్రు పాలిటెక్నిక్ కళాశాల, ఎగ్జిబిషన్ గ్రౌండ్
- నాంపల్లి, చాంద్రాయణగుట్ట - నిజాం కాలేజీ
- యాకుత్ పుర - సరోజిని నాయుడు కాలేజీ, నాంపల్లి
- బహదూర్ పుర - సాంకేతిక విద్య భవన్, మాసబ్ ట్యాంక్
- సికింద్రాబాద్ - పీజీఆర్ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓయూ
- కంటోన్మెంట్ - సీఎస్ఐఐటీ, వెస్లీ కాలేజ్
18) మహబూబ్ నగర్ జిల్లాలో 5 నియోజకవర్గాలున్నాయి. అందులో నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చర్ల సెగ్మెంట్ లకు సంబంధించిన కౌంటింగ్ - "జేపీ ఇంజినీరింగ్ కాలేజీ ఆడిటోరియం ధర్మాపుర్" లో జరగనుంది.
దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ- జేపీ కాలేజీ, అబ్దుల్ కలాం బిల్డింగ్ లో నిర్వహించనున్నారు.
19) నాగర్ కర్నూల్ జిల్లాలోని 3 నియోజకవర్గాలకు గాను "అగ్రికల్చర్ మార్కెట్ యార్డు, నెల్లికొండ" లో కౌంటింగ్ జరగనుంది.
20) వనపర్తి జిల్లాలోని 1 సెగ్మెంట్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు "న్యూ అగ్రికల్చర్ మార్కెట్ బిల్డింగ్, వనపర్తి" లో నిర్వహించనున్నారు.
21) జోగులంబా గద్వాల జిల్లాలోని 2 సెగ్మెంట్ల కౌంటింగ్ "ఓల్డ్ బిల్డింగ్, ఎస్కేటీఆర్ కాలేజ్, గద్వాల" లో జరగనుంది.
22) నల్గొండ జిల్లాలోని 6 నియోజకవర్గాలకు గాను ఓట్ల లెక్కింపు ప్రక్రియ "టీఎస్ హౌసింగ్ వేర్ హౌస్ కార్పొరేషన్, దుప్పల్లాపల్లి" లో జరగనుంది.
23) సూర్యాపేట జిల్లాలోని 4 సెగ్మెంట్లకు సంబంధించిన కౌంటింగ్ "ఏఎంసి గోదాం, సూర్యాపేట" లో నిర్వహించనున్నారు.
24) యాదాద్రి జిల్లాలోని 2 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు "అరోరా ఇంజినీరింగ్ కాలేజీ, భువనగిరి" లో జరగనుంది.
25) జనగామ జిల్లాలోని 3 సెగ్మెంట్ల కౌంటింగ్ "వీబీఐటి, పెంబర్తి" లో జరగనుంది.
26) మహబూబాబాద్ జిల్లాలోని 2 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు "ఫాతిమా హై స్కూల్, మహబూబాబాద్" లో నిర్వహించనున్నారు.
27) వరంగల్-రూరల్ జిల్లాలోని 2 సెగ్మెంట్ల కౌంటింగ్ "ఏఎంసి యార్డు, ఏనుమాముల" లో జరగనుంది.
28) వరంగల్ - అర్బన్ జిల్లాలోని 3 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ "MLS గోదాం, ఎనుమాముల లో నిర్వహించనున్నారు.
29) భూపాలపల్లి జిల్లాలోని 2 నియోజకవర్గాలకు గాను కౌంటింగ్ "అంబేద్కర్ స్టేడియం, భూపాలపల్లి
" లో జరగనుంది.
30) కొత్తగూడెం జిల్లాలోని 5 సెగ్మెంట్ లకు సంబంధించిన కౌంటింగ్ "అనుబోసు ఇంజినీరింగ్ కాలేజీ, పాల్వంచ"లో నిర్వహించనున్నారు.
31) ఖమ్మం జిల్లాలోని 5 సెగ్మెంట్లకు గాను ఓట్ల లెక్కింపు "విజయ ఇంజినీరింగ్ కాలేజీ, ఖమ్మం" నందు నిర్వహించనున్నారు.