వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Telangana EAMCET 2020: ఈ నెల 19న ఎంసెట్ నోటిఫికేషన్..21 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఎంసెట్ 2020 షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 19న తెలంగాణ ఎంసెట్‌కు నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఫిబ్రవరి 21 నుంచి విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు ఉన్నత విద్యామండలి ఛైర్మెన్ పాపిరెడ్డి చెప్పారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడుతాయని పాపిరెడ్డి చెప్పారు. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులను పూర్తి చేసేందుకు మార్చి 30వ తేదీ చివరి తేదీగా చెప్పారు. ఇక అపరాధ రుసుం రూ.500తో దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ ఏప్రిల్ 6 అని పాపిరెడ్డి వివరించారు. రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 13వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

దరఖాస్తుల్లో ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని సవరించుకునేందుకు మార్చి 31 నుంచి ఏప్రిల్ 3వరకు అవకాశం ఉంటుందని చెప్పారు పాపిరెడ్డి. అలాగే రూ.5వేల ఆలస్య రుసుంతో ఏప్రిల్ 20వ తేదీ వరకు, రూ. 10వేల ఆలస్య రుసుంతో ఏప్రిల్ 27వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పాపిరెడ్డి వివరించారు. ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. మే, 4,5,7వ తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్, మే 9వ తేదీ 11వ తేదీల్లో ఎంసెట్ వ్యవసాయ వైద్య పరీక్షలు జరుగుతాయని పాపిరెడ్డి వివరించారు.

Telangana EAMCET Schedule 2020 Released,Here are the full details

ఎంసెట్ షెడ్యూల్ పూర్తి వివరాలు

ఎంసెట్ నోటిఫికేషన్: 19 ఫిబ్రవరి 2020
ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ: 21 ఫిబ్రవరి నుంచి మార్చి 30 వరకు
దరఖాస్తుల్లో సవరణలు పూర్తి చేసేందుకు: 31 మార్చి నుంచి ఏప్రిల్ 3 వరకు
రూ.500 ఫైన్‌తో దరఖాస్తుల స్వీకరణ : 6 ఏప్రిల్ 2020
రూ. 1000 ఫైన్‌తో దరఖాస్తుల స్వీకరణ : 13 ఏప్రిల్ 2020
రూ. 5000 ఫైన్‌తో దరఖాస్తుల స్వీకరణ : 20 ఏప్రిల్ 2020
రూ.10000 ఫైన్‌తో దరఖాస్తుల స్వీకరణ :27 ఏప్రిల్ 2020
హాల్ టికెట్ డౌన్‌లోడ్: 20 ఏప్రిల్ నుంచి మే 1 వరకు
ఇంజినీరింగ్ విభాగం పరీక్ష : మే 4 వ తేదీ, 5వ తేదీ 7వ తేదీ
వ్యవసాయ విభాగం పరీక్ష : మే 9వ తేదీ
వైద్య పరీక్షలు : మే 11వ తేదీ

English summary
Telangana state Higher education Chairman Papireddy had released the Telangana EAMCET 2020 schedule. Online Applications will start from Feb 21st and end on March 30 said the Chairman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X