వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిద్ధమైతే 4 రాష్ట్రాల కంటే ముందే తెలంగాణకు ఎన్నికలు, పది రోజుల్లో: ఈసీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అంతా సిద్ధమైతే నాలుగు రాష్ట్రాల కంటే ముందే తెలంగాణకు ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ తెలిపారు. తెలంగాణ ఎన్నికలపై పది రోజుల్లో తేల్చేస్తామని వెల్లడించారు. అంతకుముందు ఆయన ఎన్నికల షెడ్యూల్ పైన తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడటాన్ని తప్పుబట్టారు. అది ఎన్నికల కమిషన్ పరిధిలోనిదని చెప్పారు.

Recommended Video

ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ సత్తా చాటుతారా...?

చదవండి: బాబు మోహన్, కొండా సురేఖలకు అందుకే షాక్: 105 మందిలో ఓడినవారూ

రద్దయిన అసెంబ్లీకి తొలుత ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం రూలింగ్ ఉందని తెలిపారు. ఎన్నికలకు సిద్ధమని తెలంగాణ సీఈవో నివేదిక పంపించారని తెలిపారు. దానిని ఆడిట్ చేసేందుకు బృందాన్ని పంపిస్తున్నామని, ఓటర్ల జాబితా సమస్య కాదన్నారు.

Telangana: Election Commission to send team to review poll preparedness next week

కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు కమిషనర్‌గా డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రసాద్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్నారు. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.

చదవండి: ఆ కమిటీలో రేవంత్ రెడ్డికి చోటు: చంద్రబాబు-రాహుల్ గాంధీ దోస్తీ ఖాయం!

తెలంగాణకు అవసరమైన ఈవీఎంలు, వీవీపీఏటీలలో కొన్నింటిని బెంగళూరులోని బెల్ నుంచి తెలంగాణకు పంపుతున్నారు. తెలంగాణలో గడువులో అంటే 2019 ఏప్రిల్ - మే నెలల్లో ఎన్నికలు జరుగుతాయని భావించి హైదరాబాద్‌లో ఈసీఐఎల్‌లో తయారైన ఈవీఎంలను మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌, మిజోరంలకు పంపించారు. దీంతో తెలంగాణకు బెంగళూరులోని బెల్‌ నుంచి రానున్నాయి. 52,100 బ్యాలెట్ యంత్రాలు, 40,700 కంట్రోల్ యూనిట్లు, 44 వేల వీవీపీఏటీలు పంపుతున్నారు.

English summary
As per the ruling, “as and when an Assembly is prematurely dissolved, the Election Commission has to fix its calendar for holding fresh election within the time”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X