హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ టీఆర్ఎస్‌దే: హరీష్,కేటీఆర్‌లకు రికార్డ్ మెజార్టీ, రేవంత్ రెడ్డి, సుహాసిని సహా నేతల ఓటమి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు నేడు (మంగళవారం - 11-12-2018) వెలువడినాయి. ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. టీఆర్ఎస్ 88, మహాకూటమి 21, మజ్లిస్ 7, బీజేపీ 1, ఇతరులు 2 స్థానాల్లో గెలిచారు.

కీలక స్థానాలు

గజ్వెల్ నియోజకవర్గంలో వంటేరు ప్రతాప్ రెడ్డిపై కేసీఆర్ 58వేల పై చిలుకు ఓట్లతో గెలిచారు.

కూకట్‌పల్లి నియోజకవర్గంలో సుహాసినిపై మాధవరం కృష్ణారావు 43వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు.

కొడంగల్ - రేవంత్ రెడ్డి పైన పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించారు.

సిరిసిల్ల - కేకే మహేందర్ రెడ్డి పైన కేటీఆర్ 58వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు.

సిద్దిపేట - హరీష్ రావు లక్షకు పైగా మెజార్టీతో గెలిచారు.

Telangana Election Result 2018 Live Updates: No smooth sail for KCR

Newest First Oldest First
9:30 PM, 11 Dec

ఖమ్మం జిల్లాలో మహాకూటమి 8 చోట్ల, తెరాస 1చోట, స్వతంత్రులు 1చోట గెలిచారు.
9:30 PM, 11 Dec

వరంగల్ జిల్లాలో 12 సీట్లు ఉండగా తెరాస 10 సీట్లు, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచింది.
9:30 PM, 11 Dec

నల్గొండలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా తెరాస 9, కాంగ్రెస్ 3చోట్ల గెలిచింది.
9:30 PM, 11 Dec

మహబూబ్ నగర్ జిల్లాలో 14 స్థానాలు ఉండగా తెరాస 13, కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించారు.
9:30 PM, 11 Dec

హైదరాబాదులో 15 స్థానాలు ఉండగా తెరాస 7, మజ్లిస్ 7, బీజేపీ 1 స్థానంలో గెలిచింది.
9:30 PM, 11 Dec

రంగారెడ్డి జిల్లాలో 14 సీట్లు ఉండగా తెరాస 10, కాంగ్రెస్ 3, ఇతరులు 1 స్థానంలో గెలిచారు.
9:30 PM, 11 Dec

మెదక్ జిల్లాలో పది స్థానాలు ఉండగా తెరాస 9, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచింది.
9:29 PM, 11 Dec

కరీంనగర్‌లో 13 స్థానాలు ఉండగా తెరాస 11, కాంగ్రెస్ 1, స్వతంత్రులు 1చోట గెలిచారు.
9:29 PM, 11 Dec

నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు ఉండగా టీఆర్ఎస్ 8 చోట్ల, కాంగ్రెస్ 1 చోట గెలిచింది.
9:29 PM, 11 Dec

అదిలాబాద్ జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో తెరాస 9 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం ఒక స్థానంలో గెలిచింది.
7:51 PM, 11 Dec

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలుపొందారు. 800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
7:26 PM, 11 Dec

కోదాడ ఫలితం చివరి వరకు ఉత్కంఠను రేపింది. కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వీవీప్యాట్ ఓట్ల లెక్కింపుకు డిమాండ్ చేశారు. తీవ్ర ఉత్కంఠ మధ్య కోదాడలో తెరాస అభ్యర్థి విజయం సాధించారు. ఇక్కడి నుంచి ఉత్తమ్ సతీమణి పద్మావతి ఓడిపోయారు. 668 ఓట్ల ఆధిక్యంతో తెరాస గెలిచింది.
7:15 PM, 11 Dec

పలు జిల్లాల్లో తెరాస క్లీన్ స్వీప్ సాధించింది.
6:24 PM, 11 Dec

ములుగులో సీతక్క 22వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందారు.
5:30 PM, 11 Dec

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఫలితం ఉత్కంఠను రేపుతోంది. రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం మారుతోంది. మల్ రెడ్డి రంగారెడ్డి 100 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
5:20 PM, 11 Dec

కార్వాన్‌లో మజ్లిస్ పార్టీ విజయం సాధించింది.
5:20 PM, 11 Dec

కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినిపై తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావు 43వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు.
4:25 PM, 11 Dec

ఆలేరులో గొంగిడి సునీత గెలుపొందారు. జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు.
4:09 PM, 11 Dec

గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ 17,750 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తెరాస అభ్యర్థి ప్రేమ్ సింగ్ పైన విజయం సాధించారు.
3:58 PM, 11 Dec

గజ్వెల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ 51వేల పై చిలుకు ఓట్లతో గెలిచారు. సిరిసిల్ల నుంచి కేటీ రామారావు 85వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు. సిద్దిపేట నుంచి హరీష్ రావు ఒక లక్షకు పైగా ఓట్లతో గెలిచారు.
3:32 PM, 11 Dec

తెరాస గెలుపు నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి.
3:16 PM, 11 Dec

గజ్వెల్ నియోజకవర్గం నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి పైన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ 51వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు.
3:13 PM, 11 Dec

అంబర్ పేట నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఓడిపోయారు.
3:13 PM, 11 Dec

కేసీఆర్‌కు చంద్రబాబు, నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
2:40 PM, 11 Dec

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో వైసీపీ అధినేత వైయస్ జగన్.. కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు.
2:34 PM, 11 Dec

మేడ్చల్‌లో తెరాస అభ్యర్థి మల్లారెడ్డి 80వేల పై చిలుకు ఓట్లతో ఓడిపోయారు.
2:18 PM, 11 Dec

కరీంనగర్‌లో పొన్నం ప్రభాకర్ ఓడిపోయారు.
2:12 PM, 11 Dec

మధ్యాహ్నం రెండు గంటల వరకు తెరాస 50 స్థానాల్లో ముందంజలో ఉండగా 38 స్థానాల్లో గెలిచింది. మహాకూటమి 15 స్థానాల్లో ముందంజలో, ఆరు స్థానాల్లో గెలుపు, బీజేపీ 2 స్థానాల్లో ముందంజలో, మజ్లిస్ మూడు స్థానాల్లో ముందంజలో, మూడు స్థానాల్లో గెలుపు సాధించారు.
2:10 PM, 11 Dec

కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఓటమి చవి చూశారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డాక్టర్ కె లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రా రెడ్డి, రామచంద్ర రావులు ఓడిపోయారు.
2:08 PM, 11 Dec

ఆందోల్‌లో దామోదర రాజనర్సింహ ఓడిపోయారు. నర్సాపూర్‌లో సునితా లక్ష్మీరెడ్డి ఓడిపోయారు. బోధన్‌లో సుదర్శన్ రెడ్డి ఓడిపోయారు. కోదాడలో పద్మావతి ఓడిపోయారు. జనగామలో పొన్నాల లక్ష్మయ్య పరాజయం పాలయ్యారు. పరకాలలో కొండా సురేఖ పరాజయం పాలయ్యారు. మహబూబాబాద్‌లో బలరాం నాయక్ ఓడిపోయారు.
READ MORE

Telangana Election Result 2018 Live Updates: No smooth sail for KCR

English summary
Telangana Assemblly elections results 2018. The state went to polls on December 7, when 73.2 per cent polling was recorded. A total of 1,821 candidates contested for 119 assembly seats in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X