వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సక్సెస్ మంత్ర: టీఆర్ఎస్ ఘన విజయం వెనక కేసీఆర్ ఫార్ములా ఏమిటో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు కేసీఆర్ సిద్దం అవుతున్నారు. ఆనాడు ఉద్యమనాయకుడిగా బరిలో దిగిన కేసీఆర్ 2014లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం నాయకత్వం వహించారు నేడు పరిపాలన కోసం నాయకత్వం వహిస్తున్నారు కేసీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాధారణంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాలేదు. తెలంగాణలో మాత్రం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి తిరిగి అధికారం చేపట్టబోతున్నారు. కొత్త చరిత్ర లిఖించారు. కేసీఆర్‌ను గద్దె దింపేందుకు కాంగ్రెస్ టీడీపీ, టీజేఎస్,కమ్యూనిస్టులు ఒక్కటి అయినప్పటికీ ప్రజలు మాత్రం టీఆర్ఎస్ వైపే తామంతా ఉన్నట్లు స్పష్టమైన మెజార్టీ ద్వారా నిరూపించారు.

ఉద్యమనాయకుడిగా సక్సెస్...పరిపాలనాధ్యక్షుడిగా సక్సెస్

ఉద్యమనాయకుడిగా సక్సెస్...పరిపాలనాధ్యక్షుడిగా సక్సెస్

కేసీఆర్ ఒకప్పుడు ఉద్యమనాయకుడు. నేడు రాష్ట్రాన్ని నడిపిన ప్రజానాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకు నిదర్శనం టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారం చేపట్టడమే. కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ ఫథకాలే ఆయన్ను మళ్లీ రాజును చేశాయి. ముఖ్యంగా అత్యధిక వర్గాల వారికి ప్రభుత్వ ఫలాలు అందించి వారి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు గులాబీ బాస్. సాధించుకున్న తెలంగాణకు కావాల్సినవేంటో కేసీఆర్ ముందే పసిగట్టారు .అందుకే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని భావించి వారి జీవితాల్లో వెలుగు తీసుకురావాలని తలచిన కేసీఆర్ వారి కనీస అవసరసాలపై దృష్టి సారించారు. అవే డబ్బు, పెళ్లి, ఇళ్లు, నీళ్లు.

నగదు, కళ్యాణ లక్ష్మీ, ఇళ్లు, తాగునీటి పథకాలే గెలిపించాయా..?

నగదు, కళ్యాణ లక్ష్మీ, ఇళ్లు, తాగునీటి పథకాలే గెలిపించాయా..?


బతికేందుకు డబ్బు, నివాసం ఉండేందుకు ఇళ్లు, తాగునీరు,లాంటివి ప్రజలకు అందించారు. అంతేకాదు 24 గంటలు నాణ్యమైన కరెంటును కూడా ఇచ్చి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నారు. ఇక రైతులు గురించి చెప్పక్కర్లేదు. రైతులను వేధిస్తున్న ప్రశ్న కనీస మద్దతు ధర. అయితే గులాబీ దళపతి మాత్రం కనీస మద్దతు ధర, సబ్సీడీ లాంటి వాటి జోలికి వెళ్లలేదు. వాటిపై ఆధారపడలేదు. నేరుగా రైతులకు నగదును అందించాడు. అంటే ఒక సీజన్‌కు ఎకరాకు రూ.4వేలు అందించారు. అలా ఏడాదికి రూ.8వేలు ఇవ్వడంతో రైతులు సంత‌ృప్తితో ఉన్నారు. ఒక రైతుకు ఐదెకరాల పొలం ఉంటే ఆయనకు పంటకు ముందే రూ. 40వేలు చేతికందుతోంది. ఇది నిజంగానే రైతులకు పెద్ద ఊరటనే చెప్పాలి.

ఇక కూతుళ్లకు వివాహం చేయలేని తల్లిదండ్రులు ఆవేదనను అర్థం చేసుకున్నారు కేసీఆర్. అందుకే కళ్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్ పేరుతో అమ్మాయిల వివాహాం కోసం లక్ష రూపాయలు ఇచ్చారు. ఇది కూడా టీఆర్ఎస్ గెలుపునకు పెద్ద ఎత్తున దోహదపడి ఉంటుందని చెప్పాలి. ఇక వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నేరుగా పెన్షన్ రావడంతో వారు కూడా టీఆర్ఎస్‌కే ఓటువేయడం జరిగింది. ఇక డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పటికే చాలామందికి వచ్చాయి... ఇంకా అర్హులై ఉండి ఇళ్లు రాని వారికి కూడా ఇళ్లు తప్పక ఇస్తారనే విశ్వాసం పేద ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అయితే ఇళ్లు ఇంకా నిర్మాణ దశలో ఉండటంతో అవి తప్పకుండా వస్తాయని అర్హులైన ప్రజలు భావించారు. ఇక 24 గంటలు కరెంటు నీటి సరఫరా పై ప్రజల్లో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. చెప్పినట్లుగానే కరెంటు ఇచ్చారు. తాగునీటిని కూడా ఇచ్చారు. ఇవి టీఆర్ఎస్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించి ఉంటాయి.

స్థానిక నేతలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ... కేసీఆర్ వైపే ఓటరు దృష్టి

స్థానిక నేతలపై వ్యతిరేకత ఉన్నప్పటికీ... కేసీఆర్ వైపే ఓటరు దృష్టి

కేసీఆర్ కేంద్రంగా పాలన, అవినీతి ఆరోపణలు, కుటుంబపాలన, స్థానిక నేతలపై వ్యతిరేకత ఇవన్నీ కేసీఆర్ తిరిగి ప్రభుత్వంలోకి రావడం కష్టమే అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఓటర్లు మాత్రం ఇవన్నీ లెక్కపెట్టలేదు. కేసీఆర్ తరహా ప్రభుత్వానికే మరోసారి అవకాశం ఇచ్చారు. స్థానిక నేతలను ఓటరు చూడలేదు. కేవలం కేసీఆర్ పాలన, ఆయన సంక్షేమ ఫథకాలనే దృష్టిలో ఉంచుకుని కసిగా ఓటు వేసినట్లు ఈ ఫలితాలతో స్పష్టమైంది . ఇక ఈ విజయంతో భారత దేశంలో సంక్షేమ పథకాలకు ప్రజలు ఓటువేసి ఓకే చెప్పినట్లు అర్థమవుతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో... రాజకీయనాయకులు తమ హామీలను ఎలా నెరవేరుస్తారో అని చెప్పేందుకు కేసీఆర్ ప్రభుత్వం గెలుపే ఓ నిదర్శనం అని టీఆర్ఎస్ పార్టీ చెబుతోంది.

English summary
Set for his second consecutive victory in Telangana, K Chandrashekhar Rao (KCR) has made the somewhat unusual transition from a man who was only synonymous with a political struggle — the creation of the state — to a leader synonymous with a governance model for which he has reaped rich rewards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X