వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటు వేసి సెల్ఫీ తీసి, పోలీసులకు చిక్కాడు: సోషల్ మీడియాలో మరో వీడియో హల్‌చల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మధ్యాహ్నం మూడు గంటల వరకు దాదాపు 56 శాతం పోలింగ్ నమోదయింది. ఐదు గంటల వరకు ఓటింగ్‌కు అవకాశం ఉంటుంది. ఐదు గంటల లోపు ఎవరైతే ఆయా పోలింగ్ బూత్‌లలోని క్యూ లైన్లలో నిలబడతారో వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఇదిలా ఉండగా, పోలింగ్ కేంద్రాలలోకి మొబైల్ ఫోన్లు తీసుకు రావొద్దని ఈసీ ముందే చెప్పింది.

ఓటు వేసేటప్పుడు గోప్యత ఉండాలని, ఫోటో తీసినా, సెల్ఫీ దిగినా కఠిన చర్యలు తప్పవని ఈసీ ముందే హెచ్చరించింది. కానీ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఓ యువకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. శివశంకర్ అనే వ్యక్తి ఓటు వేసి ఫోటో తీసుకున్నాడు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Telangana Elections: 56.17% voter turnout recorded till 3 PM in Telangana

ఇదిలా ఉండగా, మరో వీడియో కూడా వైరల్‌గా మారింది. ఎవరో వృద్ధులు ఓటు వేసే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఉన్నవారు ఎవరో.. ఇది ఇది అంటూ చూపారు. ఆమె చేయి ఓ గుర్తు మీదకు వెళ్లింది. అక్కడ వెనుకవైపు ఉన్న వారు ఇది.. ఇది అంటూ మరోచోట ఓటు వేయించారు. అయితే ఓటువేసే వారు వృద్ధులు కాబట్టి వారు ఓ గుర్తు చెప్పి మరో గుర్తుకు ఓటు వేసే ప్రయత్నం చేయగా వారు సరిదిద్దారా.. లేక ఉద్దేశ్యపూర్వకంగా చేశారా మాత్రం తెలియరాలేదు.

English summary
Polling was on in all the 119 constituencies 32,815 polling stations spread across 31 districts in the first full-fledged elections in India's youngest state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X