• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్ రెండో జాబితా విడుదల...ఈ లిస్టులో కూడా పొన్నాలకు నిరాశే

|
  Telangana Elections 2018 : కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల ఖరారుపైనే ఉంది. ఇప్పటికే ఇతర పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా హస్తం పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థుల జాబితా పైనే కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 65 స్థానాలకు అభ్యర్థులను ఫైనలైజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ... తాజాగా 10 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది.

  రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట

  కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 10 మందికి స్థానం కల్పించింది. రెండో జాబితాలో ఒక ఎస్సీ, ఒక ఎస్టీ స్థానాలు కూడా ప్రకటించారు. మొత్తానికి రెండో జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక రెండో జాబితాలో కూడా మాజీ పీసీసీ ఛీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కలేదు. దీంతో తనకు టికెట్ దొరుకుతుందా లేదా అన్న దానిపై పొన్నాలా ఆందోళనలో ఉన్నారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి దాసోజు శ్రవణ్‌కు టికెట్ లభించింది.

  వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే: ఈసీ కళ్లు కప్పి నేతలు యథేచ్చగా బహుమతుల పంపిణీ

  ఖైరతాబాద్ దాసోజు శ్రవణ్..జూబ్లీహిల్స్ అభ్యర్థిగా విష్ణువర్థన్ రెడ్డి

  ఖైరతాబాద్ దాసోజు శ్రవణ్..జూబ్లీహిల్స్ అభ్యర్థిగా విష్ణువర్థన్ రెడ్డి

  సిరిసిల్లా అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డికి కేటాయించింది కాంగ్రెస్ హైకమాండ్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని విష్ణువర్ధన్ రెడ్డికి కేటాయించింది. అయితే ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలు టీడీపీకి కేటాయించాలని ఆ పార్టీ గట్టిగా పట్టుపట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకోలేదు. ఇక షాద్ నగర్ టికెట్‌ను ఆశించిన మాజీ మంత్రి శంకర్ రావుకు భంగపాటు తప్పలేదు. ఆ స్థానం ప్రతాప్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. మేడ్చల్‌ అభ్యర్థిగా కిచ్చెనగారి లక్ష్మారెడ్డి కి టికెట్ కన్ఫామ్ చేసింది.

  రమేష్ రాథోడ్‌కే ఖానాపూర్ టికెట్

  రమేష్ రాథోడ్‌కే ఖానాపూర్ టికెట్

  పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా కందల ఉప్పేందర్ రెడ్డికి టికెట్ కేటాయించగా...భూపాలపల్లి నియోజకవర్గాన్ని గండ్ర వెంకటరమణా రెడ్డికి కేటాయించింది. ఎస్సీ నియోజకవర్గం ధర్మపురిని అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు టికెట్ ఇవ్వగా... ఎస్టీ నియోజకవర్గం ఖానాపూర్‌ను రమేష్ రాథోడ్‌కు కేటాయించింది. అయితే రమేష్ రాథోడ్‌కు టికెట్ కేటాయించరాదంటూ గాంధీభవన్ ఎదుట ఆయన వ్యతిరేకులు ధర్నా చేసిన సంగతి తెలిసిందే.ఇక ఎల్లా రెడ్డి నియోజకవర్గం జాజల సురేందర్‌కు కేటాయించారు.

  మూడో జాబితాలో అయినా పొన్నాలకు స్థానం దక్కేనా..?

  మూడో జాబితాలో అయినా పొన్నాలకు స్థానం దక్కేనా..?

  మొత్తానికి మిగతా అభ్యర్థుల జాబితా ఈ రోజు సాయంత్రానికల్లా విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. రెండో జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి పెద్ద పీట వేసిన కాంగ్రెస్... మూడో జాబితాలో అయినా బీసీలకు ప్రాధాన్యం దక్కుతుందని భావిస్తున్నారు. ఇక పొన్నాల లక్ష్మయ్యక టికెట్ లభిస్తుందా లేదా అనేదానిపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే తాను జనగామ బరిలో నిలవడం లేదని కోదండరాం స్పష్టం చేశారు. బీసీ సీటు తీసుకున్నారన్న అపోహ రావడం తనకు ఇష్టం లేదని వెల్లడించారు. అంతేకాదు పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య గతంలో ఏఐసీసీ ఆదేశాలు సరిగ్గా అమలు పరచలేకపోయారనే ఆరోపణలు రావడంతో పొన్నాల లక్ష్మయ్య విషయంలో హైకమాండ్ ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Congress high command has released the second list with ten contesting candidates.The former PCC Chief Ponnala Lakshmaiah name was not in the list.Reddy community was given a lionshare in the list.The list also had one SC and one ST cadidates.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more