వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ మూడవ జాబితా విడుదల: ఎట్టకేలకు పొన్నాల పేరు... అసంతృప్తితో మర్రిశశిధర్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Assembly Elections 2018 : కాంగ్రెస్ మూడవ జాబితాలో పొన్నాల పేరు | Oneindia Telugu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 75 స్థానాలకు రెండు జాబితాలతో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా మూడో జాబితా విడుదల చేసింది. 13 మంది అభ్యర్థులతో లిస్టును విడుదల చేసింది. ఇదిలా ఉంటే మూడవ జాబితాలో పొన్నాల పేరు కనిపించడంతో ఎట్టకేలకు జనగాం టికెట్ పై సస్పెన్స్ వీడింది.

13 మందితో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల

కాంగ్రెస్ విడుదల చేసిన మూడో జాబితాలో ఎల్బీ నగర్‌ నుంచి సుధీర్ రెడ్డికి కేటాయించగా... బహదూర్ పురా కలీంబాబాకు కేటాయించింది. నిజామాబాద్ రూరల్ భూపతి రెడ్డికి ఇవ్వగా..నిజామాబాద్ అర్బన్ సీటును తాహెర్ బిన్ హందాన్‌కు కేటాయించింది. ఇక బాల్కొండ నియోజకవర్గాన్ని అనిల్‌కు కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానం దేవరకొండ నియోజకవర్గం నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన బాలూనాయక్‌కు టికెట్ ఇచ్చింది. కొల్లా‌పూర్‌ను హర్షవర్ధన్ రెడ్డికి ఇవ్వగా తుంగతుర్తి అద్దంకి దయాకర్‌కు కేటాయించింది.

చంద్రబాబు అడుగుజాడల్లోనే: సీబీఐకి నో ఎంట్రీ చెప్పిన మమతా సర్కార్ చంద్రబాబు అడుగుజాడల్లోనే: సీబీఐకి నో ఎంట్రీ చెప్పిన మమతా సర్కార్

 ఎట్టకేలకు పొన్నాలకే జనగామ టికెట్టు

ఎట్టకేలకు పొన్నాలకే జనగామ టికెట్టు

ఇక ఎప్పటి నుంచో సస్పెన్స్‌లో ఉన్న జనగామ సీటును పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకే కేటాయించింది. ఇక కార్వాన్ సీటును ఉస్మాన్‌కు యాకత్‌పురా సీటును రాజేందర్ రాజుకు కేటాయించింది. ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం టికెట్ ఆదివాసీల ఉద్యమనేత సోయం బాపూరావుకు ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం.ఇక ఇల్లెందు సీటును హరిప్రియ నాయక్‌కు కేటాయించింది. ఇదిలా ఉంటే సనత్ నగర్ సీటుపై గంపెడు ఆశలు పెట్టుకున్న మర్రి శశిధర్ రెడ్డికి మూడో జాబితాలో సీటు దక్కలేదు. ఈ స్థానం పొత్తులో భాగంగా టీడీపీ నేత కూనం వెంకటేష్ గౌడ్‌కు వెళ్లింది. ఇదే విషయమై టీడీపీ కూడా శనివారం అధికారికంగా ప్రకటించింది.

 మూడవ జాబితాపై మర్రి శశిధర్ రెడ్డి అసంతృప్తి

మూడవ జాబితాపై మర్రి శశిధర్ రెడ్డి అసంతృప్తి

మూడవ జాబితాలో తన పేరు కనిపించకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అలకపాన్పు ఎక్కినట్లు తెలుస్తోంది. సనత్‌నగర్‌లో తనకు కొన్ని కమిట్‌మెంట్స్ ఉన్నాయని చెప్పిన మర్రిశశిధర్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. అయితే మర్రిశశిధర్ రెడ్డికి సికింద్రాబాద్ సీటును కేటాయించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈసారి ఎన్నికలతో ఎంట్రీ ఇవ్వాలని భావించిన జానారెడ్డి కుమారుడిపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. మొత్తానికి 88 స్థానాలను ఇప్పటి వరకు ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.

ఇంకా ఆరు స్థానాలకు రావాల్సి ఉన్న క్లారిటీ

ఇంకా ఆరు స్థానాలకు రావాల్సి ఉన్న క్లారిటీ

ఇక మూడో జాబితాలో ముగ్గురు ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారికి, ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారికి, ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందినవారికి, ఒక ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారికి టికెట్ కేటాయింంచి కాంగ్రెస్ అధిష్టానం. ఇంకా ఆరు స్థానాలకు క్లారిటీ రావాల్సి ఉంది. ఇవి సికింద్రాబాద్, హుజూరాబాద్, మిర్యాలగూడ, దేవరకద్ర, మక్తల్, వరంగల్ ఈస్ట్ స్థానాలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది కాంగ్రెస్.

English summary
After carefully screening the Congress high command has released the third list of the contesting candidates for telangana assembly polls. The list with 13 candidates has been released and former PCC chief Ponnala Lakshmaiah's name was finally in the list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X